Monday, April 29, 2024

వొడాఫోన్‌లో ఉద్యోగాల కోత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ భారీగా ఉద్యోగాల కోతకు యత్నిస్తోంది. ప్రధానంగా లండన్‌లోని ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతుందని ఫైనాన్సియల్ టైమ్స్ పేర్కొంది. ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2026నాటికి డాలర్లు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు గత నవంబర్‌లో వోడాఫోన్ ప్రకటించింది.

హంగేరిలోని తన వ్యాపారాలను స్థానిక ఐటి కంపెనీ 4ఐజి, హంగేరియన్ ప్రభుత్వానికి 1.82బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు వొడాఫోన్ ఆమోదం తెలిపింది. వొడాఫోన్ టెలికాం సంస్థలో ప్రపంచవ్యాప్తంగా లక్షానాలుగువేలమందికిపైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. కాగా స్పెయిన్‌లోని టెలిఫోనికా, ఫ్రాన్స్‌లోని ఆరెంజ్ సహా ఐరోపా దేశాల్లోని టెలికాం సంస్థలు 50శాతం వ్యయం తగ్గించేందుకు చర్యలు ఆరంభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News