Friday, May 3, 2024

రాజధాని బయట బైడెన్ ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

Joe Biden to take oath outside Capitol

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్, ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలాహారిస్ తమ ప్రమాణస్వీకారాన్ని జనవరి 20న రాజధాని భవనం బయట చేయనున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో సంప్రదాయ పద్ధతికి దూరంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆరోజు కార్యక్రమం వివరాలను బైడెన్ బృందం విడుదల చేసింది. పదవీ విరమణ చేస్తున్న ట్రంప్ ఈ కార్యక్రమానికి పాల్గొంటారా లేదా అన్నది ఈ వివరాల్లో తెలియచేయలేదు. ట్రంప్ కూడా ఈ కార్యక్రమానికి తాను పాల్గొంటున్నదీ లేనిదీ తమ బృందం వారికి ఎవరికీ తెలియచేయలేదు. ఈ కార్యక్రమానికి ఎవరూ వాషింగ్టన్ డిసికి రానక్కరలేదని బైడెన్ తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ప్రమాణస్వీకారం పూర్తయిన తరువాత బైడెన్ తన ప్రారంభ ఉపన్యాసంలో వైరస్ నిర్మూలనే తన లక్షంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎప్‌డిఎ కమిషనర్ డాక్టర్ డేవిడ్ కెస్లర్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్‌గా నియామకమైనట్టు ప్రకటించే అవకాశం ఉంది.

Joe Biden to take oath outside Capitol

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News