Monday, April 29, 2024

కొవిడ్ టీకాలకు, గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదు..

- Advertisement -
- Advertisement -

భారత్‌లో కొవిడ్ టీకాలకు, గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదు.
జర్నల్ పిఎల్‌ఒఎస్‌లో ప్రచురించిన అధ్యయనం వెల్లడి
భారత్‌లో కొవిడ్ 19 నివారణకు ఉపయోగించే కొవిషీల్డ్, కొవాగ్జిన్ వంటి టీకాలకు , గుండెపోటు రిస్కు పెరగడానికి ఎలాంటి సంబంధం లేదని ఒక అధ్యయనం వెల్లడించింది. వ్యాక్సిన్ల సురక్షిత ప్రభావాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ పరిశోధన జర్నల్ పిఎల్‌ఒఎస్ వన్‌లో ఇటీవల వెలువడింది. గుండెపోటు వల్ల వచ్చే మరణాలపై టీకాల ప్రభావాన్ని ఈ అధ్యయనం నిర్ధారించింది. 2021ఆగస్టు 2022 ఆగస్టు మధ్యకాలంలో ఢిల్లీలోని జిబి పంత్ ఆస్పత్రిలో చేరిన 1578 మంది నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 1,086 మంది (68.8 శాతం) కొవిడ్ నివారణకు టీకా తీసుకోగా, 492 మంది (31.2 శాతం మంది) టీకా తీసుకోలేదు.

వ్యాక్సిన్ తీసుకున్న గ్రూపులో 1,047 మంది రెండు డోసులు తీసుకోగా, 39 మంది (4 శాతం) మంది కేవలం ఒకేఒక డోసు తీసుకున్నారు. వాస్తవానికి వ్యాక్సిన్ తీసుకున్నవారిలో గుండెపోటు వల్ల మరణించే పరిస్థితి చాలా తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలిందని జిబి పంత్ ఆస్పత్రికి చెందిన అధ్యయన నిర్వాహకులు మొహిత్ గుప్తా వివరించారు. అలాగే కొవిడ్ వ్యాక్సిన్ల వల్ల దుష్ఫలితాలు చాలా వరకు తేలికగా, క్షణికంగా, స్వీయపరిమితిగా కనిపించాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ రకం, వ్యాక్సినేషన్ తేదీ, దుష్ఫ్రభావాలు తదితర పరిశీలనతో కూడిన వ్యాక్సినేషన్ పరిస్థితికి సంబంధించిన డేటానే అధ్యయనం లో తీసుకున్నారు. వ్యాక్సినేషన్ తరువాత ఏ సమయంలోనైనా ఎఎంఐ గ్రూపు వారిలో దుష్ప్రభావాలు కనిపించలేదని వివరించారు. దీన్ని బట్టి కొవిడ్ 19 వ్యాక్సిన్లకు గుండెపోటుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమౌతోందని పరిశోధకులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News