Monday, April 29, 2024

నడ్డా సభ రద్దు?

- Advertisement -
- Advertisement -

BJP chief JP Nadda comments on PM Modi

మునుగోడు సభపై బిజెపి వెనుకడుగు

బిజీ షెడ్యూల్ కారణంగా కమల సారథి రావడం లేదని చెబుతున్న
రాష్ట్ర నాయకత్వం మండలాల వారీగా బహిరంగ సభలకు ప్లాన్

మన తెలంగాణ/హైదారాబాద్: మునుగోడులో ఈనెల 31వ తేదీన బిజెపి తలపెట్టిన జెపి నడ్డా సభ రద్దు అవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ నేతలెవరూ ఈ విషయాన్ని అ ధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఇదే ఇప్పు డు బిజెపి శ్రేణులను కలవరపెడుతుంది. ర టిఆర్‌ఎస్‌కు దీటుగా ప్రచారంలో ముందుకు బిజెపి వెళ్తున్న సమయంలో జాతీయ అధ్యక్షుడి సభ రద్దు కావడం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యాని కి గురిచేస్తుంది. ఉప ఎన్నిక దగ్గర పడుతున్న త రుణంలో అసలు ఎందుకు సభ రద్దు అవనుందో తెలియక క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ పెద్దలు ప్రచారానికి రాకపోయినప్పటికీ అంతా మేమే చూసుకుంటామని అక్కడ క్యాడర్‌లో నమ్మకం కలించేందుకు బిజెపి నేతలు ప్రయత్నం చేస్తున్నా ఎవ రు విశ్వసించడం లేదు. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో ఎంఎల్‌ఎల కొనుగోలు విషయంలో బి జెపి హస్తముందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. మరోపక్క ప్రచారంలో టిఆర్‌ఎస్ కంటే బిజె పి వెనుకంజలో ఉండడం, బిజె పి ప్రచారానికి ఆశించిన స్థాయిలో ఓటర్ల ఆదర ణ లేకపోవడం, ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లి నా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ప్రజలు నిలదీయడం వంటి కారణాలతో బహిరంగ సభకు బిజెపి ఢిల్లీ పెద్దలు హాజరుకావడం లేదని సమాచారం.

ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా బిజెపి తీసున్నప్పటికీ పార్టీ శ్రేణులలో నిసత్తువ నెలకొంది. పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బిజీ షెడ్యూల్ కారణంగా జె.పి. నడ్డా రావడం లేదని రాష్ట్ర బిజెపి నేతలు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. వాస్తవానికి మునుగోడు సభకు కేంద్రహోం మంత్రి అమిత్ షా, జెపి నడ్డా హాజరవుతారని ముందునుంచి బిజెపి నేతలు అట్టహాసంగా, ఆర్భాటంగా ప్రచారం చేశారు. అయితే అమిత్ షా రావడం లేదని, జెపి నడ్డా మాత్రమే వస్తారని ఇప్పటి వరకు చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన ఎంఎల్ ఎల కొనుగోలు వ్యవహరం వంటి అంశాల నేపథ్యంలో జెపి నడ్డా సభకు అంతరాయం కలిగిందన్న అనుమానాలు లేకపోలేదు. నడ్డా సభ రద్దు అవుతున్న వార్తల నేపథ్యంలో బిజెపి స్థానిక నాయకత్వం ఆ లోటును పూడ్చేందుకు శతవిధాల యత్నిస్తోంది. ఆ క్రమంలో ఈనెలాఖరు వరకు మండలవారీగా బహిరంగ సభలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న కొందరు కేంద్రమంతులను తీసుకురావాలని బిజెపి నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News