Monday, May 6, 2024

కూల్చే కుట్ర

- Advertisement -
- Advertisement -

Police remand report in TRS MLAs purchase case

రిమాండ్ రిపోర్ట్‌లో మరిన్ని సంచలనాలు

నందు డైరీలో 50మంది టిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎంఎల్‌ఎల వివరాలు
మూడున్నర గంటల పాటు నిందితులతో ఎంఎల్‌ఎల చర్చలు ప్రభుత్వాన్ని
అస్థిరపరిచే యత్నం కొబ్బరి నీళ్లు తీసుకురా.. డ్రైవర్‌కు రోహిత్ రెడ్డి సిగ్నల్
సంకేతం అందగానే ఫాం పోలీసుల ప్రవేశం రోహిత్ రెడ్డి జేబులో
రెండు వాయిస్ రికార్డర్లు ఢిల్లీ, కర్నాటకలో ఇలాగే చేశామన్న రామచంద్ర
భారతి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సాల్‌కు
సందేశం ఎస్‌ఎంఎస్‌లు, స్క్రీన్ షాట్లను కోర్టుకు సమర్పించిన పోలీసులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పొం దుపర్చారు. ప్రభుత్వాన్ని అ స్థిరపరిచేందుకు ప్రలోభా లు చూపిన కేసుగా పోలీసులు పేర్కొన్నారు. రహ స్య కెమెరాలు, వాయిస్ రికార్డర్లు వాడినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. హాల్‌లో రహస్య కెమెరా లు, రోహిత్‌రెడ్డి జేబులో రెండు వాయిస్ రికార్డర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఫాం మ. 3.10కి రహస్య కెమెరాలు ఆన్ చేశామని నివేదికలో స్పష్టపర్చారు. సాయంత్రం 4.10 గంటలకు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులు వచ్చారని పేర్కొన్నారు. దాదాపు మూడున్నర గం టల పాటు నిందితులతో ఎంఎల్‌ఎలు చర్చించారని నివేదికలో పేర్కొన్నారు. కొబ్బరి నీళ్లు తీసుకు రా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్‌రెడ్డికి చెప్పామని, కొబ్బరి నీళ్లు తీసుకురా అని పైలట్ రోహిత్‌రెడ్డి అనగానే లోపలికి వెళ్లామని నివేదికలో పొందుపర్చారు.

ఒక్కో ఎంఎల్‌ఎకు రూ.50 కోట్లు ఇస్తామ న్న వాయిస్ రికార్డ్ నమోదైందని పోలీసులు వెల్లడించారు. కర్ణాటక, ఢిల్లీలోనూ చేశామన్న సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి వా యిస్ రికార్డ్ నమోదైనట్లుగా నివేదికలో పేర్కొన్నారు. తుషార్‌కు రా మచంద్రభారతి ఫోన్ చేసిన ట్లు వాయిస్ రికార్డర్లలో రికార్డయ్యిందని, ఎస్‌ఎంఎస్ స్క్రీన్‌షాట్‌ను రి మాండ్ నివేదికలో పోలీసులు పొందుపర్చారు. నందు అలియా స్ నందకుమార్ డైరీలో 50మంది టిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎంఎల్‌ఎల వివరాలున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మిగతా ముగ్గురు ఎంఎల్‌ఎలు రోహిత్‌రెడ్డికి సహకరించేందుకే వెళ్లారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రి పోర్టులో పోలీసులు పేర్కొన్నారు. సునీల్ కుమార్ బన్సల్‌కు రామచంద్రభారతి ఫోన్ చేసినట్లు వా యిస్ రికార్డర్లలో నమోదైందని అందుకు సంబంధించి ఎస్‌ఎంఎస్ స్క్రీన్‌షాట్‌ను సైతం పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపర్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News