Monday, April 29, 2024

భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో…

- Advertisement -
- Advertisement -

Kajal Agarwal in latest movie starring Nagarjuna

 

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ భామ తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంటోంది. ఒకవైపు యంగ్ హీరోలతో జత కడుతూనే మరొక వైపు మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ స్టార్ హీరోలతోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం కాజల్ చిరు సరసన ‘ఆచార్య’, హిందీలో ‘ముంబై సాగా’ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. ఇక మంచు విష్ణుతో కలిసి నటించిన పాన్ ఇండియన్ సినిమా ‘మోసగాళ్ళు’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈక్రమంలోనే తాజాగా సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.

ఈ విషయాన్ని తాజాగా చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గత నెలలో నాగార్జున, – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రారంభమైంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. పతాకాలపై నారాయణదాస్ నారంగ్, పున్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోవాలో సాగుతోంది. కాగా తాజాగా ఈ షెడ్యూల్‌లో కాజల్ అగర్వాల్ వచ్చి చేరిందట. ఇక ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరిపి ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News