Saturday, May 4, 2024

ఉప్పుగూడలో భూవివాదం

- Advertisement -
- Advertisement -

KalikaMata temple land dispute over in Uppuguda

హైదరాబాద్: పాతబస్తీలోని ఉప్పుగూడలో బుధవారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక కాళికామాత దేవాలయానికి సంబంధించిన సర్వేనంబర్లు 24,25,26లోని 7.13 ఎకరాల భూమి తనదిగా పేర్కొంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి ఓ వ్యక్తి పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకుని నిర్మాణాలు చేపట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇది ఎవరిది కాదని దేవాలయానికి సంబంధించిన భూమి అన్ని స్థానికులు, బిజేపి నాయకులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. దీంతో వారికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీసుల సహకారంతో ప్రహరీని నిర్మిస్తుండగా అడ్డుకున్నారు. అడ్డుకున్న వారిని పోలీసులు ఈడ్చుకువెళ్లి వాహనాల్లో పడేశారు. కాగా, 1951లో ఈ భూమిని దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకుని ఇప్పటి వరకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు 11 సార్లు ప్రకటనలు ఇచ్చారు.

ఒకసారి వేలం పాట కూడా నిర్వహించారు. తక్కువ ధర వచ్చిందని గతంలో సిపిఐ నాయకులు దేవాదాయ శాఖ ఎదుట ధర్నా చేశారు. అంతేకాకుండా అప్పట్లో హైకోర్టుకు వెళ్లడంతో వేలంపాటను రద్దు చేశారు. ఒక్కసారిగా భూమి విలువ రూ.70కోట్లకు చేరడంతో పలువురి కన్ను పడింది. ఇంత గొడవ జరిగినా రాని వ్యక్తి ఆ స్థలం ఆలయ ట్రస్టీ తనకు విక్రయించిందని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మిస్తుండడంతో అడ్డుకున్నారు. తన భూముల్లో నిర్మాణం చేసుకుంటుంటే స్థానికులు అడ్డుకుంటున్నారని సదరు వ్యక్తి సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఆర్డర్ తీసుకుని వచ్చారు. దాని ఆధారంగా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో స్థానికులు, బిజెపి నాయకులకు మధ్య ఘర్షణకు దారితీసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News