Wednesday, May 8, 2024

‘ప్రజా కవి కాళోజీ’ బయోపిక్ షురూ

- Advertisement -
- Advertisement -

kaloji-narayana-rao

‘ప్రజాకవి- కాళోజీ’ సినిమాను జైనీ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నంది అవార్డు గ్రహీత డాక్టర్ ప్రభాకర్ జైనీ వహిస్తున్నారు. కాళోజీ పాత్రను అచ్చుగుద్దినట్టు కాళోజీ పోలికలున్న శ్రీమూలవిరాట్ పోషిస్తున్నారు. అనేక మంది ప్రముఖ సినిమా, టీవీ కళాకారులు మిగిలిన తారాగణం. కాళోజీ జీవితమంతా పోరాటమే. ఆ పోరాటాన్ని ‘ప్రజాకవి -కాళోజీ’ బయోపిక్‌లో చూపించనున్నారు.

రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణా చారి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబడింది. ఈ షూటింగ్‌లో కాళోజీ ఫౌండేషన్ సభ్యులు అంపశయ్య నవీన్, నాగిళ్ళ రామశాస్త్రి, పొట్టపల్లి శ్రీనివాసరావు, అన్వర్ పాల్గొన్నారు. ఈ చిత్రంలో పివి నరసింహారావు పాత్రను వారి తమ్ముడు మనోహర రావు పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాళోజీ కొడుకు రవి, కోడలు వాణి పాల్గొన్నారు. ఈ చిత్రానికి పాటలు: కళారత్న బిక్కి కృష్ణ, కెమెరా: రవి కుమార్ నీర్ల, సంగీతం: యస్.యస్.ఆత్రేయ, గాయకులుః వందేమాతరం శ్రీనివాస్, గోరేటి వెంకన్న, మాళవిక, భూదేవి.

kaloji narayana rao biography in telugu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News