Monday, April 29, 2024

కరీంనగర్‌లో కాపుల సమరం

- Advertisement -
- Advertisement -

అందరి దృష్టి ఆ స్థానం పైనే.., మంత్రి గంగుల, ఎంపి బండికి ప్రతిష్ఠాత్మకం

(కోల తిరుపతి/మన తెలంగాణ): కరీంనగర్ అసెంబ్లీ బరిలో ముగ్గురు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ప్రత్యర్థులుగా నిలువడంతో బిక్ ఫైట్‌గా కొనసాగుతుంది. ప్రతి నిత్యం ప్రచారంలో దూసుకెళ్తూ గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అధికార బిఆర్‌ఎస్ నుండి మంత్రి గంగుల కమలాకర్, బిజెపి నుండి ఆ పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ నుండి కరీంనగర్ రూరల్‌కు చెందిన గ్రామ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ లు బరిలో నిలిచారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకర్గంలో రికార్డును బ్రేక్ చేసి ఇప్పటికే మూడు సార్లు గెలిచిన మంత్రి గంగుల కమ లాకర్ నాల్గవ సారి కూడా గెలుపు నాదే అంటూ సీఎం కేసీఆర్ పథకాలను ప్రజలకు వివరిస్తూ జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్త చేస్తున్నారు.

మరోసారి గెలిచి తనరికార్డును ఎవరూ బ్రేక్ చేయకూడదన్న సంకల్పంతో గంగుల ముందుకు సాగతున్నారు. కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ 2014, 2018 అసెంబ్లీ ఎ న్నికల్లో మంత్రి గంగుల కమలాక ర్‌కు గట్టిపోటి ఇచ్చారు. కరీంనగర్‌లో మైనార్టీల ఓట్లు కీలకంగామారినప్పటికీ అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేశారు. దేశం కోసం ధర్మం కోసం అన్ననినాదాన్ని, హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించే ప్రయత్నం బండి చేశారు. రెండు ఎన్నికల్లో ‘బండి’కి కరీంనగర్ ప్రజలు నిరాశే మిగిల్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల ఓటర్లు బండి సంజయ్‌ని 2019 ఎన్నికల్లో అక్కున చేర్చుకుని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి ఢిల్లీకి పంపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన సంజయ్ ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నారు. ముచ్చటగా మూడోసారి కరీంనగర్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న బండి సంజయ్ ఈ సారి ఎలాగైన అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ఛాలెంజ్‌తో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతేకాకుండా బిజెపి అభ్యర్థులను గెలిపించేందుకు ఆ పార్టీ కేంద్ర నాయకత్వం స్టార్ కాంపెన్ ప్రకటించి ప్రచారం కోసం హెలికాప్టర్ కేటాయించగా తమ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తు తన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే బిసి సిఎం అని ప్రకటించడంతో బీసీ కార్డు నినాదంతో ఆ పార్టీ నేతలంతా ప్రచారంలో దూకు డు పెంచింది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్ ప్రస్తుతం బొమ్మకల్ సర్పంచ్‌గా కొనసాగుతుండగా అతని సతిమణి పురమ్ల లలిత కరీంనగర్ రూరల్ మండలం జడ్పిటిసి సభ్యు రాలుగా కొనసాగుతూ ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇప్పటికే తాను కరీంనగర్ నియోజకవర్గ ప్రజల అండదండలతో..వారు చూపుతున్న అభిమానంతో..ఆశీర్వదంతో భారీ మెజార్టీతో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తూ జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. గతంలో కరీంనగర్ నియోజకవర్గంలో టికెట్ కేటాయించేందుకు అన్నీ రాజకీయ పార్టీలు అగ్రవర్ణ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేవి. ఇప్పుడు బీసీ కార్డు నినాదంతో బిసి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలో నిలిపుతున్నాయి. కరీంనగర్ అసెంబ్లీ బరిలో ముగ్గురు అభ్యర్థులు మున్నూరు కాపులే కావడంతో కరీంనగర్ వైపై అందరి దృష్టి పడింది. కరీంనగర్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్, బిజెపి అభ్యర్థిగా జాతీయ నేత, ఎంపి బండి సంజయ్ కుమార్‌లకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిలువనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News