Friday, April 26, 2024

కాంగ్రెస్ హామీలు నెరవేరిస్తే కర్నాటక ఖజానా ఖాళీ కాగలదు: మోడీ

- Advertisement -
- Advertisement -

చిత్రదుర్గ(కర్నాటక): ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చేసిన హామీలను నెరవేరిస్తే కర్నాటక ఖజానా ఖాళీ కాగలదని మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. రానున్న ఎన్నికలను పురస్కరించుకుని ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అవాస్తవికమైనవని, కాంగ్రెస్ పార్టీ అనేక గ్యారంటీ కార్డులు జారీచేసిందని, కానీ వాటిని అమలుచేస్తే అభివృద్ధి పనులు ఆగిపోతాయని ఆయన అన్నారు. ‘దీనికి తోడు వారు బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అమలుచేసిన పనులను కూడా వారు ఆపేస్తారు’ అనిప్రధాని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ వారంటీ ముగిసిపోయిందని, దాని గ్యారంటీలకు విలువలేదని మోడీ అన్నారు. ‘కాంగ్రెస్ ట్రాక్ రికార్డు సరైనది కాదు. గుజరాత్‌లో వారు 2012లో హామీలిచ్చారు. పేద ప్రజలకు మోడల్ ఇళ్లు ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. కానీ ప్రజలు తామే కార్మికులకు కూలీ ఇవ్వాల్సి వచ్చింది. ఇదే యదార్థం’అని చెప్పుకొచ్చారు.

‘ కాంగ్రెస్, జెడి(ఎస్) వేర్వేరు పార్టీలుగా కనపడతాయి, కానీ వాటి భావజాలం ఒకటే అని మోడీ విమర్శించారు. చిత్రదుర్గలో కేంద్రం జాతీయ హైవేస్ అమలు కోసం రూ. 3500 ఖర్చు పెట్టింది. తుమ్‌కూర్‌చిత్రదుర్గదావణ్‌గేరె రైల్వే లైన్ పనులను మొదలుపెట్టింది’ అని చెప్పుకొచ్చారు.

‘చిత్రదుర్గ ఏడు రౌండ్ల కోట(ఏళు సుత్తిన కోటె…కేంద్రం కూడా దేశ ప్రజలకు ఏడు రక్షణ కోటలను ఇచ్చిందని, అవి 1.పిఎం ఆవాస్ యోజన, ఉచిత ఎల్‌పిజి సిలిండర్, మంచినీటి కనెక్షన్, 2. దారిద్య్ర రేఖ దిగువన(బిపిఎల్) ఉన్న కుటుంబాలకు రేషన్, 3. ఆయుష్మాన్ భారత్ యోజన, 4.జన్‌ధన్ బ్యాంక్,ముద్ర యోజన, 5.జీవన్ జ్యోతి, సురక్ష భీమ, అటల్ పింఛన్, 6.మహిళలకు భద్రత, 7. సామాజిక భద్రత’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News