Tuesday, April 30, 2024

కరోలినా ప్లిస్కోవాకు షాక్

- Advertisement -
- Advertisement -

గార్సియా సంచలనం, జకోవిచ్, ఒసాకా ముందుకు, మూడో రౌండ్‌లో సిట్సిపాస్, క్విటోవా, యూఎస్ ఓపెన్

Karolina falls in straight sets Garcia

న్యూయార్క్ : ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్) రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఫ్రాన్స్‌కు చెందిన 32వ సీడ్ కరోలిన్ గార్సియా చేతిలో ప్లిస్కోవా ఓటమి పాలైంది. మరోవైపు నాలుగో సీడ్ నవోవి ఒసాకా (జపాన్), ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్), 8వ సీడ్ పెట్రా మార్టిక్ (క్రోయేషియా) తదితరులు మూడో రౌండ్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీక్), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మ నీ), 27వ సీడ్ బొర్నా కొరిక్ (క్రోయేషియా)లు రెండో రౌండ్‌లో విజయం సాధించారు.
టాప్ సీడ్ ఇంటికి
మహిళల సింగిల్స్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన అగ్రశ్రేణి క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవాకు రెండో రౌండ్‌లోనే షాక్ తగిలింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గార్సియా అద్భుత ఆటతో ప్లిస్కోవాను మట్టి కరిపించింది. ఆశ్లే బార్టీ, హలెప్, స్విటోలినా, ఆండ్రెస్కో తదితరులు ఈసారి యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉండడంతో ప్లిస్కోవా కచ్చితంగా టైటిల్ సాధిస్తుందని విశ్లేషకులు అంచన వేశారు. అయితే ప్లిస్కోవా మాత్రం అనూహ్యంగా రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టి అందరికి షాక్ ఇచ్చింది. గార్సియా అసాధారణ ఆటతో ప్లిస్కోవాను కంగుతినిపించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన గార్సియా 61, 76తో ప్లిస్కోవాను ఓడించింది.
ఒసాకా అలవోకగా
మరోవైపు జపాన్ ఆశాకిరణం నవోవి ఒసాకా రెండో రౌండ్‌లో అలవోక విజయం సాధించింది. ఇటలీ క్రీడాకారిణి కమిలా గియోర్గితో జరిగిన పోరులో ఓసాకా 61, 62తో జయకేతనం ఎగు ర వేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఒసాకా ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకా శం ఇవ్వలేదు. చివరి వరకు ఆధిపత్యం చెలాయి స్తూ అలవోక విజయంతో మూడో రౌండ్‌కు చేరుకుంది. మరో పోటీలో ఆరో సీడ్ పెట్రా క్విటోవా విజయం సాధించింది. రెండో రౌండ్‌లో క్విటోవా 76, 62తో ఉక్రెయిన్ క్రీడాకారిణి కటెరినాను ఓడించింది. తొలి సెట్‌లో క్విటోవాకు ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే రెండో సెట్‌ను సునాయాసంగా గెలిచి మూడో రౌండ్‌లో ప్రవేశించింది. మరో మ్యాచ్‌లో పెట్రా మార్టిక్ విజయం సాధించింది. ఉక్రెయిన్‌కు చెంది న బొండారెంకాతో జరిగిన రెండో రౌండ్‌లో మార్టిక్ 63, 64తో జయకేతనం ఎగుర వేసిం ది. మరో పోటీలో 14వ సీడ్ అనెట్ కొంటావెట్ (ఇస్టోనియా) గెలుపొందింది. రెండో రౌండ్‌లో కొంటావెట్ స్లోవేకియాకు చెందిన కాజా జువాన్‌ను ఓడించింది. చెలరేగి ఆడిన కొంటావెట్ 64, 61తో విజయం సాధించింది.
నొవాక్ ముందుకు
ఇక పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. కిల్ ఎడ్‌మండ్ (బ్రిటన్)తో జరిగిన పోరులో జకోవిచ్ 67, 63, 64, 62 తేడాతో విజయం సాధించాడు. తొలి సెట్‌లో ఓడిన జకోవిచ్ తర్వాత వరుసగా మూడింటిలో గెలిచి ముందం జ వేశాడు. మరో పోటీలో జ్వరేవ్ జయభేరి మోగించాడు. రెండో రౌండ్‌లో జ్వరేవ్ 75, 67, 63, 61తో అమెరికా ఆటగాడు బ్రాడాన్ నకాషిమాను ఓడించాడు. మరోవైపు నాలుగో సీడ్ సిట్సిపాస్, 19వ సీడ్ ఫ్రిట్జ్ (అమెరికా), 20వ సీడ్ కరెనొ బుస్టా (స్పెయిన్) తదితరులు కూడా రెండో రౌండ్‌లో విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News