Saturday, April 27, 2024

కెసిఆర్ తో కవిత భేటీ

- Advertisement -
- Advertisement -
ప్రగతి భవన్ కు వెళ్లిన కవిత
సిబిఐ నోటీసుల నేపథ్యంలో తండ్రితో భేటీ
ఇప్పటికే కవిత న్యాయ నిపుణులతో చర్చించినట్టు సమాచారం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కలిశారు. ప్రగతి భవన్ కు వెళ్లిన ఆమె తన తండ్రితో భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. సిబిఐ కవితకు ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈ నోటీసుల నేపథ్యంలోనే కెసిఆర్ ను కవిత కలిశారు. నోటీసులపై న్యాయపరంగా, రాజకీయపరంగా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంపై కవిత ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించినట్టు సమాచారం.

హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావచ్చని నోటీసులో పేర్కొన్నారు. 160  సిఆర్ పిసి  కింద నోటీసులు జారీ చేశారు. ఈ స్కామ్ లో కవిత పాత్ర ఎంత ఉందనే కోణంలో సిబిఐ విచారణ జరపనుంది. ఈ కేసులో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును పేర్కొన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News