Wednesday, May 15, 2024

కెసిఆర్ గంగారెడ్డి మనుమరాలిపెళ్లికి హాజరైన ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్‌పై వీరాభిమానంతో తన ఇంటిపేరునే కెసిఆర్ అని మార్చకున్న గంగారెడ్డి కుటుంబసభ్యురాలి పెళ్లికి ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. బుధవారం మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన కెసిఆర్ గంగారెడ్డి మనుమరాలు వేదశ్రీ(దివ్యభారతి) అనంతరెడ్డిల వివాహానికి కల్వకుంట్ల కవిత హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి సిఎం కెసిఆర్ వెంటనడుస్తున్న గంగారెడ్డి తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2006, 2011 లో రెండుసార్లు సిఎం కెసిఆర్ జగ్గాసాగర్‌లో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. తమగ్రామంలో సిఎం కెసిఆర్ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించే గంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాల్లోను కెసిఆర్ గంగారెడ్డిగానే సుపరిచితుడు. తమ మనుమరాలి పెళ్లికి సిఎం కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత హాజరుకావడంపట్ల గంగారెడ్డి కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Kavitha Attend to farmer Gangareddy Grand Daughter’s Wedding

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News