Friday, May 3, 2024

హుజూరాబాద్‌లో గెలుపు గన్‌షాట్

- Advertisement -
- Advertisement -
KCR expresses confidence over victory in Huzurabad
13% ఓట్ల మెజారిటీతో గెలుస్తాం
ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వేల్లోనూ టిఆర్‌ఎస్ ముందున్నది
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మాదే విజయం
10లక్షల మందితో విజయగర్జన
27న హుజూరాబాద్‌లో బహిరంగ సభ?

మన తెలంగాణ/హైదరాబాద్: విజయ గర్జన భారీ బహిరంగ సభను ఎవరూ ఉహించని విధంగా సుమారు 10 లక్షల మందితో నిర్వహించుకుందామని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. విజయ గర్జన కోసం ప్రతి రోజు 20 నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను తెలంగాణ భవన్‌లో నిర్వహించుకుందామన్నారు. ఈ సమావేశాల్లోనే వివిధ అంశాలపై చర్చించుకుని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు సభకు హాజరయ్యేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్న ఆయన వాటిని వివరించే బాధ్యత పార్టీ కార్యకలపై ఉందని తెలిపారు. అందుకోసం త్వరలో పార్టీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆదివారం తెలంగాణ భవన్‌లో తన అధ్యక్షతన జరిగిన టిఆర్‌ఎస్‌ఎల్‌పి, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ వెల్లడించారు.

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో మరోసారి టిఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతున్నదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని రకాల సర్వేలోనూ టిఆర్‌ఎస్ పార్టీ ముందు ఉందన్నారు. పార్టీ అభ్యర్ధికి మరింత మెజార్టీ దక్కే ందుకుగానూ ఈ నెల 27వ తేదీన హుజురాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కెసిఆర్ తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తర్వాత ప్లీనరీ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. రెండు దశాబ్దాల్లో టిఆర్‌ఎస్ ప్రస్థానంతో పాటు ఏడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించేందుకు నవంబరు 15న వరంగల్లో విజయ గర్జన పేరిట భారీ సభ నిర్వహించనున్నామన్నారు. ఇందుకోసం స్థల సేకరణ చేయాలని ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సహా పలువురు మంత్రులను ఈ సందర్భంగా కెసిఆర్ ఆదేశించారు. కాగా సభ ఏర్పాట్ల పరిశీలనకు త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వరంగల్ పర్యటన చేయనున్నారన్నారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News