Saturday, May 18, 2024

19 ఏళ్ల తర్వాత మళ్లీ థామస్ కప్ దక్కించుకున్న ఇండొనేసియా

- Advertisement -
- Advertisement -

Indonesia won Thomas Cup again after 19 years

 

ఆర్హస్: ఇండోనేసియా డిఫెండింగ్ చాంపియన్ చైనాను ఓడించి 14వ సారి ఈ కప్‌ను గెలుచుకుంది. ఆదివారం డెన్మార్క్‌లోని ఆర్హస్‌లో జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3 0 తేడాతో చూనాపై విజయం సాధించింది. 2002 తర్వాత ఇండోనేసియా థామస్ కప్ ఫైనల్లో విజయం సాధించడం ఇదే మొదటి సారి. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఆంథోనీ సినిసుకా చైనాకు చెందిన లు గ్వాగ్జుపై 18 21, 21 14, 21 16 స్కోరుతో మూడు సెట్లలోనే విజయం సాధించి ఇండోనేసియాకు శుభారంభం అందించాడు. అనంతరం ఫజర్ అలాన్, ముహమ్మద్ రియాన్ అర్డియానో జంట చైనా జోడీ హె జిటింగ్ ఝోవు హావోడోంగ్‌లపై 21 12, 21 19తో వరస సెట్లలోసునాయాసంగా విజయం సాధించి తిరుగులేని ఆధిక్యతను అందించింది. ఆ తర్వాత జొనాతన్ 21 14, 18 21, 21 14 స్కోరుతో క్రిస్టీ లిషిఫెంగ్‌పై గెలుపొంది ఇండొనేసియాకు అద్భుత విజయాన్ని అందించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News