Monday, May 6, 2024

కె సి ఆర్.. పొలిటికల్ “పవర్”

- Advertisement -
- Advertisement -

కే..సీ ఆర్.. అంటే కాలువలు చెరువులు.. రిజర్వాయర్లు అని నేను నా ట్విట్టర్ వేదికగా అభిప్రాయం పంచుకునే వాన్ని. కానీ ఇటీవల తాజా రాజకీయ పరిణామాలు శ్రద్ధగా గమనిస్తే.. కే సీ ఆర్ అంటే నాలెడ్జ్, క్లెవర్, రివర్ అని ఆంగ్లంలో.. కరుణ, చేయూత, రాజకీయ చతురత అని తెలుగులో నిర్వచించేలా ఆయన ను ఆసక్తి గా అధ్యయనం చేస్తే అవ”గతం” అవుతుంది. శుక్రవారం నాడు సార్ జన్మదినోత్సవాన్ని ఎందరో ఓ ఉత్సవంలా ఉత్సాహంగా శక్తి కొద్ది జరుపుకున్నారు. ముషీరాబాద్ మెన్నొనైట్ బ్రదర్న్ ఉన్నత పాఠశాల లో నాతో పాటు టెన్త్ చదివిన దన్నారం మహేందర్ రెడ్డి ఇపుడు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బీ ఆర్ ఎస్ అధ్యక్షులుగా ఉన్నారు. కే సీ ఆర్ వంటి నాయకుణ్ణి, రాజకీయ తెలివి గలిగి వున్న వ్యక్తిని నా జీవితంలో చూడలేదు ఇక ముందు కూడా చూస్తానన్న నమ్మకం లేదు అని పేర్కొన్నాడు.

తెలంగాణ వస్తుందా?! ఆన్న ప్రశ్నకు, తన దైన ఉద్యమ శైలితో వావ్.. వండర్. అని నోళ్లు మూయించిన అద్భుత చతురత కే సీ ఆర్ అనక తప్పదు. రాజకీయాలు ఎందర్నో చూశాయి. కానీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయాలకే పాఠాలు నేర్పారు అని చెప్పక తప్పదు. ఈ రోజు సారు జన్మ దినోత్సవం ఊరూ, వాడా జరుపుకుంటున్నాము అంటే.. అందరి నర నరాన సీ ఎమ్ కే సీ ఆర్ ఓ గమ్మత్తు మహత్తుగా ప్రవహిస్తుంది అని ఇట్టే అర్థం అవుతుంది. ఈ వ్యాసం రాయడానికి నేను రాజకీయ నాయకున్ని కాక పొవచ్చు.. కానీ నాయకుడి గా.. తెలంగాణను నడిపిస్తున్న ఘనత కే సీ ఆర్ అనే మూడు అక్షరాలదే. కొడుకు దేకని ఓ పండుటాకు పెద్ద కొడుకు ఇచ్చే ఆసరానే వెన్నెముక చేసుకున్నది అన్నది నిర్వివాదాంశం. రైతుకు బంధు వయ్యాడు. పేద బిడ్డకు కళ్యాణలక్ష్మి గా దేవుడిలా దీవించాడు. షాదీ ముబారక్ చెప్పి నేనున్నా అన్నాడు. బాలిoతలకు కే సీ ఆర్ కిట్ తో బుజ్జాయిలకు తాతయ్య దీవెన ఇచ్చాడు. ఈ సంక్షేమ పథకాలు ఇలా ఉంటే.. భగీరథ ప్రయత్నం చేసి తెలంగాణా ఇంచు ఇంచును జల కళతో గల గల లాడెలా చేశారు.

అపర భగీరథుడు. ఏమ్ చేస్తాడో చూద్దాం అని.. రాజకీయ చదరంగంను ఆసక్తిగా గమనించే వాళ్ళకు అసలు ఊహించ జాలని ఎత్తులు ఇలా కూడా ఉంటాయా అని దిమ్మ తిరిగిపోయేలా ఎంతో ఎత్తుకు రాజకీయాల ప్రతిభ ను “ఇట్స్ మీ” అని పొలిటికల్ గ్లామర్ గా తేట తెల్లం చేశాడు. ఎంతో శోధిస్తే తప్ప అర్దం అయ్యి, అర్దం కాని ఓ పరిశోధన పత్రం అయ్యారు. నిజంగా ఎవరైనా ఆసక్తి తో శక్తి తో కే సీ ఆర్ సార్ పై పరిశోధన పత్రం కోసం ప్రయత్నిస్త్తే ఖచ్చితం గా వాళ్ళకు తెలంగాణ.. అంగుళం అంగుళం మార్గ దర్శనం చేసే గైడ్ అవుతుంది.మా అమ్మమ్మ ఎంగల్ రామలింగమ్మ, ఎన్నికలు జరిగిన ప్రతి సారి మక్తల్ నియోజక వర్గం లోని ఆత్మకూర్ (వనపర్తి) లో ఉపవాసం ఉండి ఓటు వేసేది. ఎందమ్మమ్మ ఇది.. అంటే.. కే సీ ఆర్ నా పెద్ద కొడుకు అసుంటోడు. మాయన్న అనేది. దేశ, రాష్ట్ర రాజకీయాలను చాలా దగ్గరగా వీక్షించే, సమీక్షించే భారత సమాచార సేవ కు చెందిన ఓ విశ్రాంత అధికారి ఇటీవల నాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయాలకు SHREWD POLITICIAN ఆన్న పదానికి అర్ధం చెప్పిన ఏకైక నాయకుడు కే సీ ఆర్ అని స్పష్టం చేశారు.

రాజకీయాలే.. తెలివైనవి అందునా ఎవరూ ఊహించని ఎత్తులు పై ఎత్తులతో ఔరా.. అనిపించేలా అవతలి తలల ను మైండ్ బ్లాక్ చేసేలా.. తెలివిగా రాజకీయాలు చేయడం కే సీ ఆర్ కే సాధ్యం అయ్యింది అని చెప్పవచ్చు. భారత రాజకీయాల్లో రాజకీయం చేసే వాళ్లు ఎందరో ఉన్నా.. రాజకీయాలకు “కీ” గా తన మేధస్సూ ను మార్చారు ముఖ్య మంత్రి కే సీ ఆర్. తపన ఉండాలే కాని అసాధ్యం ఏది లేదు అంటుంటాము. రాజకీయ తాపసి గా కే చంద్ర శేఖర్ రావ్ పేరు ను భారత రాజకీయాల్లో లిఖించ వచ్చు. తన జోలికి వస్త్తే.. ఏ మైతదొ.. ఇటీవలే కొందరికి తేట తెల్లం చేశారు. బక్కగా.. ఉన్నా చిక్కని, చక్కని అనన్య సామాన్య ఆలోచన ధోరణి తో క్యా.. సొంచ్ తా.. కైసే సొoచ్ తా.. సమజ్ మే నహీ ఆతా..అనే లా.. యావత్ దేశ రాజకీయ నాయకులకే ఓ చదవాల్సిన గ్రంధం అయ్యారు కే సీ ఆర్.

                                                                                        మాచన రఘునందన్
                                                                                           9441252121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News