Sunday, May 5, 2024

ప్రతి ఇంటిలో కెసిఆర్ పథకం..మళ్లీ కారుదే విజయం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ సీనియర్ నేత, వ్యాసకర్త పి.ఎల్. శ్రీనివాస్

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రంలో ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభు త్వ పథకం అందిందని, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని ఉన్న అన్ని కుటుంబాలకు ఏదో ఒక పథకం లేదా ఒక్కో కుటుంబానికి రెండు అంతకు మించి పథకాలు అందాయని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వ్యాసకర్త పి.ఎల్.శ్రీనివాస్ పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు పథకాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సబ్బండ వర్గాలకు చేరాయని, ఇదే కెసిఆర్‌ను రాబోయే ఎన్నికల్లో సునాయసం గా గెలిచేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. కెసిఆర్ గెలుపు సు నాయసమంటూ అనేక సర్వేలు చెబుతున్న మాట వాస్తవం అని స్పష్టం చేశారు.

సర్వేలు చేస్తున్న సంస్థలు, చెబుతున్న విషయాలు అంత ఆషామాషీగా తీసుకోవాల్సిన అవసరం లేదని, సర్వేల వెనుక క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనం, అన్ని వర్గాల ఓటర్ల అభిప్రాయాలు ఉంటాయని వివరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చినంత ప్రాధాన్యత గత ఏ ఇతర ప్రభుత్వాలు ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదని, అందుకు ప్రత్యక్ష ఉదాహారణే పెన్షన్లు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 44,12,882 మంది పెన్షన్లు పొందుతున్నారంటే సంక్షేమం ఏమాదిరిగా ఉందో అంచనా వేయవచ్చని చెప్పారు. రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు గురుకుల పాఠశాలలు, కాలేజీలు, స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎస్‌టి సబ్‌ప్లాన్ కింద ప్రభుత్వం రూ.43, 936.32 కోట్లను ఖర్చు చేసింది. గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలను మార్చిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదని, పోడు పట్టాలు అందజేయడంతోపాటు గిరిజనులపై ఉన్న కేసులను ఎత్తివేసిందని అన్నారు. బిసి సంక్షేమంలో భాగంగా రూ.లక్ష అందజేస్తున్నదని, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలను మంజూరు చేసి వాటి కోసం విలువైన స్థలాలను కేటాయించిందని,బిసి స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో హనుమంతుడి గుడిలేని ఊరు లేదు.. కెసిఆర్ పథకం పొందని ఇల్లు లేదు అని వ్యాఖ్యానించారు. లబ్ధిపొందిన ప్రతి వ్యక్తి తన ఓటును కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్‌కు వేయాలని చూస్తుండటంతో కారు గెలుపు… సారు గెలుపు ఖాయమైందని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News