Saturday, April 27, 2024

భద్రత.. భరోసా…

- Advertisement -
- Advertisement -

ఆర్‌టిసి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత
మార్గదర్శకాలను ఖరారు …ఫైలుపై సంతకం చేసిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్: ఆర్‌టిసి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్‌టిసి ఉద్యోగులు సిఎం దృష్టికి తెచ్చారు. దీంతో సిఎం కెసిఆర్ ఉద్యోగులకు ఎలాంచి వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సిఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలు రూపొందించింది. దీనికి ఆయన ఆమోదం తెలిపారు.ఉద్యోగ భద్రత మార్గదర్శకాలపై ముఖ్యమంత్రి సంతకం చేయడం పట్ల రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సిఎం పెద్ద మనసుతో టిఎస్‌ఆర్టీసిని ఆదుకుంటున్నారని, సంస్థ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ అభ్యున్నతి దిశగా తీసుకెళ్లడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహాకారాలనందిస్తోందన్నారు. అందుకు ప్రతి ఉద్యోగి సంస్థపై నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరో కీలక హామిని నెరవేర్చి తన పెద్ద మనసును చాటుకున్నారంటూ ముఖ్యమంత్రికి రవాణా శాఖ మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
టిఎస్‌ఆర్టీసి ఉద్యోగ భద్రత మార్గదర్శకాలివే…!
టిఎస్‌ఆర్టీసీ ఉద్యోగ భద్రత అంశం ఫైలుపై సిఎం కెసిఆర్ గురువారం సంతకం చేశారు. అయితే అందుకు సంబంధించి మార్గదర్శకాలీవిధంగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం మాదిరి ప్రయాణికులు తప్పు చేసినా కండక్టర్లపై పెద్దగా చర్యలు ఉండబోవని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఇప్పటివరకు ప్రయాణికులు టికెట్‌‌‌‌ తీసుకోపోతే కండక్టర్ బాధ్యత వహించాల్సి వచ్చేది. అలాంటి సంఘటన ఒకటి, రెండు సార్లు జరిగితే కొందరికి మెమోలు జారీ చేయగా, మరికొందరిని ఉద్యోగాలను నుంచి తొలగించేవారు. ఇకపై టికెట్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రయాణికుడిదేనని అధికారులు తేల్చిచెబుతున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం టికెట్ తీసుకోని ప్రయాణీకుడి వద్ద నుంచి రూ.500 జరిమానా పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఇదే క్రమంలో ఇకపై ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కట్‌‌‌‌ చేయడం, డ్యూటీలు వేయకపోవడం వంటివి ఉండవు. కాగా, పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాథమికంగా డ్రైవర్‌దే తప్పు అని తేలితే తాత్కాలికంగా సస్పెన్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు డిపో మేనేజర్లతో కమిటీ వేసి, ఎంక్వైరీ చేస్తారు. ఇందులో డ్రైవర్‌కు మాట్లాడటానికి, ఎలా జరిగిందో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరగా డ్రైవర్‌దే నిర్లక్ష్యం అని తేలితే మాత్రం భారీ మూల్యం తప్పదు. నేర తీవ్రతను బట్టి చర్యలు తీసుకోనున్నారు. కానీ ఎలాంటి తప్పు లేకుంటే విధుల్లోకి తీసుకుంటారు. మరోవైపు టికెట్ లెస్ ప్రయాణంపై ప్రయాణీకులకు అవగాహన కల్పించే విధంగా అన్ని బస్‌స్టేషన్లు, ముఖ్యమైన, రద్దీ ప్రాంతాల్లో పోస్టర్లు అంటించనున్నారు.

KCR Signed on RTC Job Security Guidelines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News