Saturday, May 4, 2024

‘సామాన్యుడి’ ప్రమాణ స్వీకార వేదిక

- Advertisement -
- Advertisement -

 

 కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార వేదికపై ఆటోడ్రైవర్, బస్ మార్షల్, రైతులు సహా ఢిల్లీ అభివృద్ధికి తోడ్పడిన 50మంది
 నేడు ఉదయం 10 గంటలకు రాంలీలా మైదానంలో ప్రమాణం
 కాబోయే మంత్రులకు కేజ్రీ విందు

న్యూఢిల్లీ: గత ఐదేళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనలో ఢిల్లీ అభివృద్ధికి తోడ్పడిన దాదాపు 50 మంది ఆదివారం జరిగే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడమే కాక, ఆయనతో పాటు వేదికపై ఆసీనులవుతారు కూడా. సాధారణంగా ప్రమాణ స్వీకారానికి తమ బలాన్ని చాటుకోడానికి ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకుల్ని ఆహ్వానిస్తుంటారు. కానీ కేజ్రీవాల్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ సిఎంగా మూడోసారి ప్రమాణం చేయబోతున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి రావలసిందిగా కేజ్రీవాల్ సాధారణ పౌరుల్ని ఆహ్వానించారు. ఢిల్లీని తీర్చిదిద్దేందుకుమాన్యులే కృ షి చేశారని తెలియడంకోసమే కొందరిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంచుకున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియా మీడియా సమావేశంలో చెప్పారు. వారిలో అంగన్‌వాడీ వర్కర్లు, రైతులు, పారిశుద్ధ కార్మికులు, ఆటో డ్రైవర్లు, మెట్రో డ్రైవర్లు ఉన్నారు. అంతేకాక ఆహ్వానితుల్లో ఢిల్లీ నిర్మాణ్‌కు కృషి చేసిన ఉపాధ్యాయులు, బస్ మార్షల్స్, వాస్తుశిల్పులు, డాక్టర్లు, ఇంజినీర్లు, అగ్నిమాపక సిబ్బంది ఉన్నారని, ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో జరిగే అర్వింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి హాజరై, ఆయనతో వేదిక పంచుకోబోతున్నారని మనీష్ సిసోడియా చెప్పారు. కేజ్రీవాల్ ఆదివారం ఉదయం పది గంటలకు ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఆయన సిఎంగా ప్రమాణం చేయడం వరసగా ఇది మూడోసారి. కేజ్రీవాల్‌తో పాటు ఆయ న కేబినెట్ కూడా ప్రమాణస్వీకారం చేస్తుంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఆప్ 62 సీట్లు గెలుచుకుంది. 8 స్థానాలు బిజెపి దక్కించుకుంది.

Kejriwal to be Sworn oath as CM of Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News