Thursday, May 9, 2024

మాకు అఖండ గౌరవం

- Advertisement -
- Advertisement -

 

ఎఫ్‌బిలో నేను నంబర్ 1, మోడీ నంబర్ 2
ఫేస్‌బుక్ ర్యాంకింగ్‌లపై ట్రంప్
వాషింగ్టన్ : తమకున్న ప్రజాదరణను బట్టి ఫేస్‌బుక్ తనకు నంబర్ 1, భారత ప్రధాని నరేంద్రమోడీ నంబర్ 2గా ర్యాంక్ ఇవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జూకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యను అమెరికా అధ్యక్షుడు ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ‘ఇది గొప్ప గౌరవం. డోనాల్డ్ జె.ట్రంప్ ఫేస్‌బుక్‌లో నంబర్ 1అని, ప్రధాని భారత ప్రధాని మోడీ నంబర్ 2 అని మార్క్ జూకర్‌బర్ ఇటీవల పేర్కొన్నారు. నిజానికి నేను రెండు వారాల్లో ఇండియాకు వెళ్లబోతున్నాను’ అని ట్రంప్ శనివారం ట్వీట్ చేశారు. ట్రంప్ మొదటిసారి భారత్ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఈ ర్యాంకింగ్ వెలువడడం విశేషం. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానం మేరకు ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ఫిబ్రవరి 24,25 తేదీల్లో ఇండియాలో అధికారికంగా పర్యటించబోతున్నారని ఈ వారం ప్రకటించారు.

I’am no.1 on Facebook, PM Modi no.2: TRUMP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News