Saturday, May 4, 2024

సిఎఎపై సుప్రీంలో కేరళ సర్కార్ సవాల్

- Advertisement -
- Advertisement -

Pinarayi-Vijayan

 రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపణ
పిటిషన్లపై 22న సుప్రీం విచారణ

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) సవాల్ చేసేందుకు కేరళ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగం ఇచ్చి న సమానత్వం, స్వేచ్ఛ, లౌకికతత్వం హక్కుల్ని ఈ చట్టం ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు ప్రకటించాలని కోరింది. ఈ చట్టాన్ని సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాల్లో సిపిఎం పాలనలో ఉన్న కేరళ మొద టి రాష్ట్రం. ఈ చట్టానికి వ్యతిరేకంగా మొదట తీ ర్మానం చేసిన ఘనతకూడా కేరళ అసెంబ్లీకే దక్కుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (చట్టం ముందు అందరూ సమానమే), ఆర్టికల్ 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ), ఆర్టికల్ 25 (మానసిక స్వేచ్ఛ, ఇష్టమైన మతాన్ని స్వీకరించి, ప్రచారం చేసే స్వేచ్ఛ) లను 2019లో తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ఉల్లంఘిస్తోందని ప్రకటించాలని కేరళ ప్రభుత్వం ఆ పిటిషన్‌లో విన్నవించింది.

రాజ్యాంగ మౌలిక సిద్ధాంతమైన సెక్యులరిజంను కూడా సిఎఎ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. సిఎఎ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి రెండో వారానికల్లా స్పందించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు డిసెంబర్ 18న కేంద్రానికి నోటీస్ జారీచేసింది. జనవరి 10న నోటిఫై అయిన సిఎఎ మతపరమైన హింసలకు గురై 2014 డిసెంబర్ 31 నాటివరకు ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారతదేశ పౌరసత్వాన్ని కల్పిస్తోంది. సిఎఎకు వ్యతిరేకంగా దాఖలైన 59 పిటిషన్లను జనవరి 22న సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ (ఐయుఎంఎల్), జమైత్ ఉలామా ఇ హింద్, ఆల్ అసోం స్టూడెంట్స్ యూ నియన్ (ఆసు), పీస్ పార్టీ, సిపిఐ, ఎన్‌జిఓల రిహా య్ మంచ్, సిటిజన్స్ ఎగైనెస్ట్ హేట్, కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్, ఆర్‌జెడి నాయకుడు మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మోయిత్రా, ఎఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీతో సహా అనేకమంది సిఎఎను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు.

Kerala Govt Challenge in Supreme Court on CAA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News