Monday, April 29, 2024

మైనార్టీల కోటాను ప్రశ్నించిన హిందూ సంస్థకు హైకోర్టు జరిమానా

- Advertisement -
- Advertisement -

కొచ్చి: కొన్ని వర్గాల వారు వెనుకబడిన తరగతులకు చెందిన వారు కాదని ప్రకటించాలని కోరిన హిందూ సంస్థకు కేరళ హైకోర్టు జరిమానా విధించింది. హిందూ సేవా కేంద్రం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ రూ.25,000 జరిమానా విధించింది. ఈ సొమ్మును కేరళలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న బాలలకు ఆర్థిక సాయం చేయడానికి ఉద్దేశించిన బ్యాంకు ఖాతాకు ఒక నెలలోగా జమ చేయాలని తెలియచేసింది. ఈ ఆదేశాలను పాటించకుంటే కేరళ రివెన్యూ రికవరీ యాక్టు 1968 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హిందూ సేవా కేంద్రం కోశాధికారి శ్రీకుమార్ మన్‌కుఝి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ముస్లింలు, లాటిన్ కేథలిక్స్, క్రిస్టియన్ నాడార్లు, క్రైస్తవంలో చేరిన షెడ్యూల్డ్ కులాల వారిని వెనుకబడిన తరగతులకు చెందిన వారుగా పరిగణించరాదని ఆదేశించాలని హైకోర్టును కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ రాజ్యాంగం, చట్టం కొన్ని వర్గాలను మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులుగా గుర్తించాయని, దీని ప్రకారమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాయని పేర్కొంది.

Kerala HC Fine to Hindu firm over Redetermine Minority status

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News