Monday, April 29, 2024

తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతిబిడ్డకు పోరాడే గుణం: ఈటెల

- Advertisement -
- Advertisement -

చేగుంట. పేద ప్రజలకోసమే పోరాడి అమరుడైన మన కేవల్‌కిషన్ రాబోయే తరాలకు స్పూర్తి దాతగా నిలిచిపోతారని బిజెపి చేరికల కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ అన్నారు.సోమ వరం రోజు మెదక్ జిల్లా ముదిరాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైండ్ల సత్యనారయణ ఆద్వర్యంలో చేగుంట మండల పరిధిలోని పొలంపల్లి గ్రామ శివారులో కేవల్‌ కిషన్ 62 వ వర్ధంతి సందర్బంగా గ్రామ చౌరస్తా వద్ద కేవల్ కిషన్ స్వారక నిర్మాణం వద్ద దుబ్బాక ఎంఎల్ఎ రఘునందన్‌రావు, మెదక్ జిల్లా ముదిరాజ్ అద్యక్షులు బైండ్ల సత్యనారాయణ లతో కలసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బం గా మాట్లాడుతూ కేవల్‌కిషన్ మరణించినా మన గుండెల్లో జీవించి ఉన్నారని తెలిపారు.

తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతిబిడ్డకు పోరాడే గుణం ఉంటుందని తెలిపారు. ఆకలినైనా బరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని బరించలేరని ఈ సందర్బంగా తెలిపారు. మెదక్ ,దుబ్బాక నియోజక వర్గాల మద్య ఉన్న స్థలంలో కేవల్‌కిషన్ పేరు గుర్తుండే విదంగా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పని చేసినా భవిశ్యత్తు తరాలకు ఉనప యోగ పడేలా ఉండాలని తెలిపారు.కేవల్ కిషన్ గుర్తుగా ఇక్కడ ఉన్న అర్బన్ పార్కుకు కేవల్ కిషన్ పేరు పెట్టాలని డిమాండ్ చేసారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో కేవల్ కిషన్ ఉన్నాడని తెలిపారు.ఇక్కడ ప్రజలు ఆయనను దేవునిగా కొలుస్తారని తెలిపారు. మెదక్ జిల్లా ముదిరాజ్ వర్కింగ్ ప్రసి డెంట్ బైండ్ల సత్యనారయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి ఆరాద్యదైవం అని తెలిపారు.

ఇక్కడ ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. ఈ సందర్బంగా చేగుంటకు చెందిన తీగల భూమలింగం గౌడ్ కెవల్ కిషన్ వద్ద అబివృద్ది కార్యక్రమాలకు 1 లక్ష రూపాయలు అందజేసారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ముదిరాజ్ వర్కింగ్ ప్రసి డెంట్ బైండ్ల సత్యనారయణ తో పాటు గడ్డం శ్రీనివాస్, భూమలింగం గౌడ్,జనార్ధన్‌రెడ్డి, పొలంలపల్లి సర్పంచ్ సత్యం, మండల వైస్ ఎంపీపీ మున్నూర్ రామచంద్రం, నాయకులు గోవింద్,భూపాల్,సురేష్, కెవల్ కిషన్ కుటుంబ సభ్యులు డాక్టర్ వీణ కుమారి రిటైర్డ్ కమీషనర్ తెలంగాణ వైద్య విదాన పరిషత్ ,గోవర్దన్‌రావు, కెవల్‌కుమార్,అమృత,రూప ,తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News