Tuesday, April 30, 2024

వ్యవసాయ చట్టాలు రద్దు… మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిసాన్ మోర్చా

- Advertisement -
- Advertisement -

Kisan morcha wel come to Modis decision

ఢిల్లీ: మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. పార్లమెంటరీ విధానాల ద్వారా ప్రకటన అమలులోకి వచ్చే వరకు వేచి చూస్తామని, ఇది జరిగితే భారతదేశంలో ఒక సంవత్సరం పాటు సాగిన రైతుల పోరాటానికి ఇది చారిత్రాత్మక విజయమని పొగిడింది.  ఆందోళనలో 700 మంది రైతులు మరణించారని,  లఖీంపూర్ ఖేరి లో ఆందోళన చేస్తున్న రైతులను చంపారని గుర్తు చేసింది. రైతుల మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలని కోరింది.  ఇంకా పెండింగ్ లో చాలా అంశాలు ఉన్నాయని,  కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది.  విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని పిలుపునిచ్చింది.  త్వరలోనే అన్ని రైతు సంఘాల నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News