Thursday, May 16, 2024

కిషన్‌రెడ్డి బిజెపిని నాశనం చేశారు : జిట్టా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కమలం పార్టీని రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నాశనం చేశారని బిజెపి బహిష్కృత నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శనివారం గన్‌పార్క్ వద్ద అమరవీరులు స్థూపానికి ఆయన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో ఇప్పటి వరకు ఎలాంటి కారణాలు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిం కెసిఆర్ అవినీతి, కాళేశ్వరం కమీషన్లు, కవిత లిక్కర్ స్కాం అంశం ఏమైందని ప్రశ్నించారు. కెసిఆర్‌తో బిజెపి కుమ్మక్కైందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలవకపోవడానికి కారణం బిఎల్ సంతోష్ ఎమ్మెల్యేల కనుగోలు అంశమేనని ఆరోపించారు.
జిట్టా ఇచ్చే సర్టిఫికేట్ అవసరం లేదు : కిషన్‌రెడ్డి
తనకు జిట్టా ఇచ్చే సర్టిఫికెట్ అవసరం లేదని, అయన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తనకు ఏ మాత్రం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా పనిచేసిన వారు బిజెపిలో చేరారని ఆయన చెప్పారు. తెలంగాణలో పార్టీపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు.
నాయకత్వాన్ని తూలనాడటం సరికాదు : కాసం
పార్టీ వీడాలనుకున్నపుడు.. భేషరతుగా వెళ్లడం మంచిది. నాయకత్వాన్ని తూలనాడటం సరికాదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు.డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ జిట్టా బాలకృష్ణారెడ్డి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తుండని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News