Wednesday, May 1, 2024

ఉద్యోగాల ‘కూ’త

- Advertisement -
- Advertisement -

ప్రముఖ సామాజిక మాధ్యమం ‘కూ’ సహా
53సంస్థలతో ఒప్పందాలు 1.50లక్షల
మంది యువతకు ఉపాధి అవకాశాలు
స్మార్ట్‌ఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌లాగే యువత
ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలి టిఎస్
ఐపాస్, టిప్రైడ్‌తో పరిశ్రమల కల్పనకు
అవకాశాలు : ఐటి శాఖ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: నైపు ణ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు.. వేదికపై మొత్తం 53 సం స్థలతో ఒప్పందం చేసుకుని అరుదైన రికార్డును సృష్టించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సమక్షంలో రాయదుర్గం టి-హబ్ 2.0లో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్(టాస్క్) కార్పొరేట్ ఒప్పంద కార్యక్రమం జరిగింది.ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి చెందిన 1.50 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ వెల్లడించింది. సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో టాస్క్ 26 కొత్త ఒప్పందాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే టాస్క్ తో ఒప్పందం చేసుకున్న 27 కంపెనీలు మళ్లీ ఒప్పందాలను పునరుద్ధరించుకోవడం జరిగిందన్నారు. వీటిలో ప్రముఖ బహుభాషా సామాజిక మాధ్యమం ‘కూ’ ఇండియా కూడా ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ‘కూ’ ముందుకొచ్చిందని, వెరసి మొత్తంగా ఒకే వేదిక మీద 53 ఒప్పందాలు జరిగాయన్నారు. తెలంగాణ అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీలను తీసుకొచ్చి… వాటిని సమర్ధవంతంగా అమలు చేస్తోందన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుంటోందన్నారు. కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థాయిలో దూసుకపోతున్నదన్నారు. దీని కారణంగానే ఐటి రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. స్మార్ట్‌ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు ఏ విధంగా అప్డేట్ అవుతుందో…. అదే విధంగా మన నైపుణ్యాలను కూడా ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలన్నారు. పోటీ ప్రపంచంలో నైపుణ్యం ఉంటేనే అవకాశాలను అందిపుచ్చుకోగలమని కెటిఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ముఖ్యంగా టిఎస్‌ఐపాస్, టి..ప్రైడ్ వంటి వాటితో పరిశ్రమల కల్పనకు ప్రభుత్వం అవకాశమిస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణలకు టి-హబ్ కేంద్రంగా మారిందన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు.. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. టాస్క్‌లో 718 కళాశాలలు భాగసామ్యమయ్యాని తెలిపారు.

ఐటిని కేవలం హెదరాబాద్, సైబారాబాద్ పరిసర వంటి మేటి పట్టణాల్లోనే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడం జరిగిందన్నారు. ఇన్నోవేషన్ సెల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని టాలెంట్‌ను వెలికితీస్తున్నట్లు తెలిపారు. ఇంటింటా ఇన్నోవేషన్ సెల్ కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించామన్నారు. గూగుల్ స్కాలర్‌షిప్ సర్టిఫికెట్ ద్వారా ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి స్కాలర్‌షిప్ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగిందన్నారు. మనం ఏం చదువుతున్నామనేది చాలా ముఖ్యమని, స్కిల్స్‌ను పెంచుకోవడం చాలా అవసరమన్నారు. నైపుణ్యతను పెంచుకోవడం వల్లే ఉద్యోగ అవకాశాలను సాధించగలుగుతామన్నారు. ఏ రంగంలో మనం ముందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆయా రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. టాస్క్ ఏర్పాటు చేసిన తర్వాత ఐటి రంగంతో పాటు వివిధ రంగాలలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అనేక కాలేజీలు టాస్క్ తో పనిచేస్తూ ప్లేస్‌మెంట్‌ను కూడా ఇస్తున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టాస్క్ సిఇఒ శ్రీకాంత్, టిహబ్ సిఇఒ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News