Saturday, April 27, 2024

గూగుల్‌కు 17.7 కోట్ల డాలర్ల జరిమానా విధించనున్న కొరియా

- Advertisement -
- Advertisement -

Korea imposes $ 17.7 billion fine on Google

 

సియోల్: దక్షిణ కొరియా వాణిజ్య నియంత్రణ సంస్థ ఫెయిర్ ట్రేడ్ కమిషన్(ఎఫ్‌టిసి) గూగుల్‌పై భారీ జరిమానా విధించనున్నది. తమ(యాప్‌లను) సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాలంటూ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులపై ఒత్తిడి చేసిందన్న కారణంగా గూగుల్‌పై 17.7 కోట్ల డాలర్ల జరిమానా విధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. శాంసంగ్‌లాంటి కంపెనీల స్మార్ట్‌ఫోన్లలో ఇతర సాఫ్ట్‌వేర్‌లను గూగుల్ బ్లాక్ చేయడాన్ని ఎఫ్‌టిసి తప్పు పట్టింది. కొరియా తమ దేశ టెలికం చట్టాల్లో మార్పు చేసింది. గూగుల్, ఆపిల్ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించేదిశగా చర్యలు తీసుకుంటోంది. తమ దేశీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు వాణిజ్యపరంగా నష్టం జరగకుండా కొరియా చర్యలు చేపట్టినట్టుగా భావిస్తున్నారు. అయితే, కొరియా విధించే జరిమానాను చట్టపరంగా సవాల్ చేయనున్నట్టు గూగుల్ యాజమాన్యం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News