Wednesday, May 1, 2024

క్రిష్-వైష్ణ‌వ్ సినిమా విడుద‌ల తేదీ ఖరారు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్రీయేటీవ్ డైరెక్టర్ క్రిష్, మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఇందులో వైష్ణవ్ కు జోడీగా అందాల బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోందిం. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను క్రిష్.. కొండ‌పాలెం న‌వ‌ల ఆధారంగా అడవి నేపథ్యంలో తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ విడుద‌లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ మూవీని అక్టోబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు సమాచారం. ఈ సినిమా విడుద‌ల‌పై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Krish-Vaishnav movie to release on Oct 8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News