Monday, April 29, 2024

తెలంగాణ భవన్‌లో రక్తదానం చేసిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దీక్షా దివస్ సందర్భంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలంగాణ భవన్‌లో రక్త దానం చేశారు. దీక్షా దివస్ సందర్భంగా బుధవారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్ ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలవేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కెటిఆర్ స్వయంగా రక్తదానం చేశారు. కాగా, అంతకు ముందు బిఆర్‌ఎస్ భవన్‌కు చేరుకున్న కెటిఆర్‌కు తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ చేపట్టవద్దని ఎన్నికల స్క్వాడ్ అభ్యంతరం తెలిపింది.

ప్రచారం గుడువు ముగిసినందున రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని పార్టీ కార్యాలయాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించింది. తెలంగాణ భవన్ బయట, ఆవరణలో కార్యక్రమాలు చేయొద్దని ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం అధికారులు బిఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. అయితే లోపల రక్తదాన శిబిరం నిర్వహిస్తామని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఇసి స్క్వాడ్ అంగీకారం తెలిపింది. సుమారు గంట పాటు జరిపిన సంప్రదింపుల తర్వాత తెలంగాణ భవన్‌లో మాత్రమే దీక్ష దివన్ నిర్వహించుకోవాలని పోలీసులు తెలిపారు. దీంతో కెటిఆర్‌తో పాటు బిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News