Friday, May 3, 2024

అతిపెద్ద స్టెంట్ తయారీ కేంద్రం

- Advertisement -
- Advertisement -

KTR launches seven factories at Medical Devices Park

హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన స్టెంట్ తయారీ కంపెనీని ఏర్పాటు చేస్తున్నాం, 2030నాటికి 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా తెలంగాణ లైఫ్‌సెన్సెస్ మెడికల్ డివైజెస్ రంగంలో భారతదేశానికే కేంద్రంగా మారాలి : సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజెస్ పార్కులో 7 లైఫ్ సైన్సెస్ కంపెనీలను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆవిష్కరణలు, పరిశోధనలు చేసే సంస్థలను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. 2030 నాటికి తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగాన్ని 100 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మలిచేందుకు ఇదొక కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు. ఇందుకోసం ఎగుమతులను తగ్గించుకునేందుకు, కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చే సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కంపెనీల ప్రోత్సాహంతో పెద్ద ఎత్తున ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజ్ పార్కులోని 7 లైఫ్ సైన్సెస్ కంపెనీలను మంత్రి కెటిఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, హైదరాబాదుకు సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కంపెనీ వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కంపెనీని ఎస్‌ఎంటీ నిర్మిస్తోందని తెలిపారు. మెడికల్ డివైజెస్ రంగంలో భారతదేశానికి తెలంగాణ ఓ కేంద్రంగా మారాలని కెటిఆర్ ఆకాంక్షించారు.

ఇతర దేశాల నుంచి ఇండియా 78 శాతం మెడికల్ పరికరాలను దిగుమతి చేసుకుంటుందని మంత్రి తెలిపారు. గత రెండు, మూడేళ్ల క్రితం బయో ఏషియా సదస్సుల్లో మెడికల్ డివైజెస్ తయారీదారులతో తాను మాట్లాడానని, భారత్‌లో కానీ, తెలంగాణలో కానీ మెడికల్ డివైజెస్ ఉత్పత్తికి ఏం సదుపాయాలు కావాలో అడిగి తెలుసుకున్నానని చెప్పారు. కరోనా సమయంలో చేతులను ధరించిన గ్లౌజ్లు, మాస్కులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటే, ఇక్కడ తయారు చేసిన ఖర్చు కంటే కూడా తక్కువ ధరకు వస్తున్నాయని వారు తెలిపారని, ఇది విని తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే మనం ఎన్ని సవాళ్లు ఎదుర్కొవాలో వారి చెప్పిన దానిబట్టి అర్థమైందని అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ఒక ఆలోచనతో, ఒక వ్యూహాంతో లైఫ్ సైన్సెస్ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

ఒక వైపు హైదరాబాద్‌కు దక్షిణాన శ్రీశైలం రోడ్డులోని ముచ్చెర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. అలాగే జీనోమ్ వ్యాలీని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలో తయారయ్యే మూడోవంతు వ్యాక్సిన్లు తెలం గాణలోనే తయారవుతున్నాయని ఈ సందర్బంగా కెటిఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో పారిశ్రామిక కాలు ష్యం ఉండకూడదన్న ఉద్దేశంతో అలాంటి పరిశ్రమలను ఒఆర్‌ఆర్ బయటకు తరలిస్తున్నామని తెలిపారు. నాలుగేళ్ల క్రితం మెడికల్ డిజైజ్ పార్కు శంకుస్థాపనకు వచ్చినప్పుడు రాళ్లు,రప్పలతో ఉండేదని గుర్తు చేశారు. సాగుకు యోగ్యంగాలేని ఈ ప్రాంతంలో 50 కంపెనీలు వివిధ స్థా యిల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ రోజు ఏడు కంపెనీలను ప్రారంభించుకున్నామని, మిగ తా వాటిని కూడా త్వరలోనే ప్రారంభించుకుంటామని తెలిపారు.

మెడికల్ డివైజ్ పార్క్‌లో ఏర్పాటవుతున్న కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 7 వేల మందికి, పరోక్షంగా 15 వేల మంది ఉపాధి లభిస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. మెడ్‌టెక్ ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉందని, ఇటీవల ప్రారంభించిన మెడ్‌ట్రానిక్ సంస్థ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రోబోల సాయంతో శస్త్రచికిత్సల దిశగా మెడ్‌ట్రానిక్ సంస్థ కృషి చేస్తోందని చెప్పారు. రోగిని పర్యవేక్షించేందుకు ‘మై కేర్ లింక్ హార్ట్’ యాప్‌ను అభివృద్ధి చేశారని అన్నారు. ఈ సందర్భంగా ప్రా రంభానికి సిద్ధమైన ప్రోమియా థెరపెటిక్స్, హువెల్ లైఫ్ సైన్సెస్, ఆకృతి ఆక్యులోప్లస్ట్రీ, ఆర్కా ఇంజినీర్స్, ఎస్‌విపి టెక్నో ఇంజినీర్స్, ఎల్వికాన్ అండ్ రీస్ మెడిలైఫ్ యాజమాన్యాలకు కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నూతన యూనిట్లలో రాష్ట్రం నుంచి ఇన్ విట్రో డయాగ్నోసిస్, కేర్ డివైసెస్, అనలైజర్లు, ఆక్యులర్ ఇంప్లాట్స్, సర్జికల్, డెంటల్ ఇంప్లాట్స్ వంటి మెడికల్ ఉత్పత్తులను ఈ కంపెనీలు తయారు చేయనున్నాయి. హువెల్ లైఫ్ సైన్సెస్‌లో పిసిర్‌కి సంబందించిన టెస్ట్ కిట్లు తయారవుతాయి. ఇది తన మొత్తం తయారీకి కావలసిన ముడి పదార్ధాలు భారతదేశంలో దొరికే ముడి పదార్థాలతో ఈ కిట్లు తయారు చేస్తుంది. ప్రస్తుత కొవిడ్ సంక్షోభంలో మేక్ ఇన్ ఇండియా స్పూర్తితో కొవిడ్ టెస్టింగ్‌కు ఉపయోగించే ఆర్‌టిపిసిఆర్ కిట్స్‌ను తయారుచేసి సుమా రు 20 రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేయనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News