Saturday, April 27, 2024

కృత్రిమ మేధ సదస్సుకు కెటిఆర్‌కు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దుబాయిలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌ను ఆహ్వానించారు. జూన్ 7, 8వ తేదీల్లో జరిగే దుబాయిలోని జుమేరా ఎమిరేట్స్ టవర్ వేదిక కానుంది. మంత్రి కెటిఆర్ సారథ్యంలో తెలంగాణ అద్భుతమైన పురోగతిని, ఐటి, ఐటి అనుబంధ రంగాల్లో సాధించిందని, ఇలాంటి నాయకులు తమ సమావేశంలో పాల్గొనడం వలన సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు మంత్రి కెటిఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు. దుబాయ్‌లో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఆరోగ్య రంగం, రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటికే విజయవంతమైన అనుభవాలను, వాటి ఫలితాలను ఈ సమావేశంలో ప్రదర్శించనున్నారు. దుబాయ్‌కి అత్యంత కీలకమైన ఈ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రాథమికంగా చర్చించడంతోపాటు, వివిధ దేశాల నుంచి పాల్గొంటున్న ప్రతినిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమ అనుభవాలను వివరిస్తారని నిర్వాహకులు వెల్లడించారు. మంత్రి కెటిఆర్ హాజరు కావడం ద్వారా దుబాయ్‌లో ఉన్న భారతదేశ, ముఖ్యంగా తెలుగు ప్రవాస భారతీయ టెక్నాలజీ రంగ నిపుణులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

తెలంగాణ అనుభవాల నుంచి విదేశాలతో పాటు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ రీజియన్ వంటి ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతినిధులు స్ఫూర్తి పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. 41వ గ్లోబల్ ఎడిషన్ ఆఫ్ వరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News