Friday, April 26, 2024

అంతర్జాతీయంగా పరువు పోయింది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Responds on New York Times Article

2022 కల్లా బుల్లెట్ ట్రైన్ తెస్తామని హామీ ఇచ్చారు.
ఆఖరికి ఇలా బుల్డోజర్ డెలివరీ చేశారు
న్యూ జెర్సీలో బుల్డోజర్, దానిపై వాళ్లిద్దరి ఫోటోలు 
అంతర్జాతీయంగా పరువు పోయిందన్న కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ది న్యూ యార్క్ టైమ్స్ అనే అమెరికాకు చెందిన వార్తా సంస్థ ప్రచురించిన ఓ కథనంపై కూడా మంత్రి కెటిఆర్ స్పందించారు. ఏకంగా అమెరికాలోని న్యూజెర్సీలోని ఓ వీధిలో బుల్డోజర్ పై ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలతో అక్కడి పార్టీ అభిమానులు పరేడ్ నిర్వహించుకున్నారు. అయితే, దీన్ని న్యూ యార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. బుల్డోజర్ అనేది ఇండియాలో అణచివేతకు చిహ్నంగా మారిందని ఆ కథనంలో న్యూ యార్క్ టైమ్స్ రాసింది. “బుల్డోజర్ భారతదేశంలో అణచివేతకు చిహ్నంగా మారింది. న్యూ జెర్సీ పరేడ్‌లో అది కనిపించడం వల్ల ఈ ప్రాంతంలోని హిందూ, ముస్లిం వర్గాల మధ్య లోపాలను బహిర్గతం చేసింది” అని ది న్యూ యార్క్ టైమ్స్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను మంత్రి కెటిఆర్ రీ ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా పరువు పోయిందని అన్నారు. “అంతర్జాతీయ స్థాయిలో పరువు పోయింది. 2022 కల్లా బుల్లెట్ ట్రైన్ తెస్తామని హామీ ఇచ్చారు. ఆఖరికి ఇలా బుల్డోజర్ డెలివరీ చేశారు” అంటూ కెటిఆర్ ఎద్దేవా చేశారు.
విపక్షాలది అర్థం లేని వాదన
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ ర్యాంకులు విడుదలైన వేళ మంత్రి కెటిఆర్ విపక్షాల తీరును కూడా ప్రశ్నించారు. వారు అర్థం లేని మాటలు మాట్లాడడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయన్నారు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల్లో తెలంగాణ టాప్‌లో ఉంటున్నా కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించారు. ‘గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో మన రాష్ట్రానికి చెందిన మున్సిపాలిటీలు ఏకంగా 16 అవార్డులు గెలుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చే ఈ ర్యాంకుల్లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. అయినా తెలంగాణలోని విపక్షాలు, కేంద్ర పెద్దలు కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని అంటున్నాయి. విపక్షాల లాజిక్ లేని మాటలు ఆశ్చరాన్ని కలిగిస్తున్నాయి” అని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు.

KTR Responds on New York Times Article

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News