Saturday, May 4, 2024

అలా చేస్తేనే సురక్షితంగా ఉంటాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్:నగరంలోని కరోనా కంటైన్మెంట్ జోన్లలో ఐటి, పురపాలక శాఖమంత్రి కెటిఆర్ ఆకస్మికంగా పర్యటించారు. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులు అందుతున్నాయా? అని మంత్రి కెటిఆర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే స్థానిక అధికారులను సంప్రదించాలన్నారు. ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉంటేనే సురక్షితంగా ఉంటామని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో సేవలు అందిస్తున్న పారిశుధ్య సిబ్బంది, వైద్య సిబ్బందితో మంత్రి కెటిఆర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి వైరస్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

KTR Visits Corona Cantonment Zones in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News