Wednesday, May 1, 2024

ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్‌పై డ్రోన్లతో సర్వే

- Advertisement -
- Advertisement -

Land survey for Mumbai-Hyderabad bullet train project

 

థానే : ముంబై -హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు క్షేత్రస్థాయిలో రంగం సిద్ధం అయింది. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన గ్రామస్తులకు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రతిపాదన గురించి సోమవారం అధికారికంగా తెలిపారు. ప్రతిపాదిత ముంబై -హైదరాబాద్ హై స్పీడ్ రైలు లేదా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సాధాసాధ్యాలపై ఇప్పుడు రైల్వే విభాగం సర్వే చేపట్టింది. ఇది కార్యరూపం దాలిస్తే భూముల స్వాధీనం ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు గ్రామస్తులకు ముందుగానే తెలియచేశారు. ఈ బుల్లెట్ ట్రైన్ నిర్వహణకు సర్వే నిర్వహించి తరువాత దీనికి అనుమతి దక్కితే ముంబైపుణే హైదరాబాద్‌లు అత్యంత వేగవంతపు రైలు ప్రయాణాల పరిధిలోకి వస్తాయి. మహారాష్ట్ర, తెలంగాణల్లోని 11 నిర్ణీత స్టేషన్ల మీదుగా ఈ రైలు వెళ్లుతుందని, ఇప్పుడిది సర్వే దశలో ఉందని దేశంలో స్పీడ్ రైళ్ల నిర్వహణకు సంబంధించిన హై స్పీడ్ రైలు కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సి) అధికారులు తెలిపారు.

ప్రతిపాదిత ప్రాజెక్టు సమగ్ర వివరాలను సంస్థ డిప్యూటి జిఎం ఎన్‌కె పాటిల్ వీడియో రూపంలో ఇటీవలే థానే డిప్యూటి కలెక్టర్ ( భూ సేకరణలు) ప్రశాంత్ సూర్యవంశి ఇతర అధికారుల సమక్షంలో ప్రదర్శించారు. ఈ 649 కిలోమీటర్ల మార్గం అంతా కూడా గ్రీన్‌కారిడార్ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన పని జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ఆమోదం పొందితే ఇకపై హైదరాబాద్ ముంబై మధ్య ప్రయాణ సమయం కేవలం మూడు గంటలే అవుతుంది. ఇప్పుడు రైలులో వెళ్లడానికి కనీసం 14 గంటలు పడుతోంది. ఇప్పటి అంచనాల మేరకు మొత్తం పది స్టేషన్లను ఈ ప్రాజెక్టు పరిధిలోకి తెచ్చే వీలుంది. థానే, నవీ ముంబై, లొనావాలా, పుణే, బారామతి, పండరీపూర్, షోలాపూర్, గుల్బర్గా, వికారాబాద్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లను ఖరారు చేశారు.

ఒక్క థానే జిల్లాలోనే ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా 1200 హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది. ఈ మేరకు ఆయా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయదార్ల నుంచి భూమి స్వాధీనానికి చట్టపరమైన చర్యలకు దిగాల్సి ఉంటుంది. నష్టపరిహారం ఖరారు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు సర్వే కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రాజెక్టుకు ఏఏ ప్రాంతాల్లోని భూమిని తీసుకోవల్సి ఉంటుందనే అంశాన్ని ఖరారు చేసుకుంటున్నారు. ఈ రైలు కారిడార్‌ను ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులు, హరిత ప్రాంతాల వెంబడి ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దరిదాపుల్లో ఉండే ప్రధాన పట్టణాల అనుసంధాన రాదార్లకు దగ్గర నుంచి నిర్వహించాలని భావిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News