Sunday, April 28, 2024

చిరునవ్వులతో మురిపిస్తూ…

- Advertisement -
- Advertisement -

Lavanya tripathi

యువ హీరో కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో కొత్త దర్శకుడు పెగళ్ళపాటి కౌశిక్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఇందులో కార్తికేయ స్వర్గపురి వాహనం నడిపే బస్తీ బాలరాజుగా నటిస్తుండగా.. లావణ్య ‘మల్లిక’ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ లుక్, టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం హీరోయిన్ లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో లావణ్య మామూలు డ్రెస్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ సాధారణ యువతిగా కనిపించింది. ఆమె ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఆమని, – శ్రీకాంత్ అయ్యంగర్, – మహేష్ – భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవలే తిరిగి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News