Monday, April 29, 2024

పట్టణాలతో పల్లెలు పోటీ!

- Advertisement -
- Advertisement -

త్వరలోనే ఇంటర్నెట్ సదుపాయంతో అన్ని గ్రామాలకు డిజిటల్ సొబగులు
3 జిల్లాలు, 918 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు
అన్ని పంచాయతీ భవనాలకు చేరిన టీఫైబర్

 

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఇక పట్టణాలతో పోటీ పడనున్నాయి. సాంకేతిక పరమైన అంశాల్లో దూసకపోనున్నాయి. త్వరలోనే గ్రామాలన్ని డిజిటల్ సొబగులతో అలరించనున్నాయి. పట్టణాలతో సమానంగా గ్రామాలను సైతం శరవేగంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇందులో భాగంగా పల్లెలను ప్రగతిపథంలో నడిపించేందుకు అనేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తోంది. పట్టణాలను, గ్రామాలను రెండు కళ్లుగా భావించి ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధిలో పరుగులు పెటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నది. ఈ మేరకు టీ ఫైబర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల భవనాలకు ఫైబర్ లైన్‌లు వేయడం కూడా పూర్తయ్యింది. పైలెట్ ప్రాజెక్టు కింద తొలత రాష్ట్రంలోని నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే 918 గ్రామాలను ఇందుకోసం ఎంపిక చేసుకున్నారు. నెట్‌కనెక్టివిటీ ఇన్‌స్టాలేషన్ కోసం బిబిఎన్‌ఆర్ అనే సంస్థతో కలిపి టి..ఫైబర్ పనిచేస్తున్నది.

కాగా ప్రభుత్వ సూచన మేరకు గ్రామ పంచాయతీలు కూడా సొంత నిధులతో కంప్యూటర్లను సమకూర్చుకుంటున్నాయి. దీంతో త్వరలోనే తెలంగాణ గ్రామాలు డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న పథకాల నేపథ్యంలో గ్రామాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలె పల్లె ప్రగతికి సంబంధించి పిఎస్ యాప్, ఇన్‌స్పెక్షన్ యాప్‌లను తీసుకొచ్చారు. పంచాయతీ కార్యదర్శి చేపట్టే రోజువారి, నెలవారీ కార్యకలాపాలను సజావుగా సాగించేందుకు ఈ యాప్‌లు ఉపయోగపడుతున్నాయి. పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, వ్యర్థాల సేకరణ, పలె ్లప్రగతి పనులు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, పంచాయతీ ఆదాయం, ఆమోదించిన చెక్కులు, జీతాల రసీదులు ఇలా ఏ పని చేసినా ఈ యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఇవే కాకుండా ప్రతి నెలా పంచాయతీల ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేస్తున్నారు. తాజాగా ఇండ్ల రికార్డులను కూడా డిజిటలైజ్ చేసి కూడా ఆన్‌లైన్‌లో పెట్టారు. అయితే ఈ పనులన్నింటికీ ఇంటర్నెట్ సిగ్నల్ ప్రధాన అడ్డంకిగా మారింది.

కొన్ని మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్ సిగ్నల్ సరిగాలేక వివరాల నమోదు ఆలస్యం అవుతున్నది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే సర్కారు పంచాయతీలకు ఫైబర్‌నెట్ సదుపాయం కల్పించనున్నది. గతంలో గ్రామాల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ సదుపాయం లేక కార్యదర్శులు ప్రతిరోజు సాయంత్రం మండల కేంద్రానికి వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి వచ్చేది. నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తే ఇకపై ఇలాంటి సమస్యలు ఉండవు. ప్రజలకు సత్వర సేవలు అందుతాయని పంచాయతీ కార్యదర్శులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News