Wednesday, May 1, 2024

రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం

- Advertisement -
- Advertisement -

Leopard in Rajendra Nagar Hyderabad

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపింది. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. నెల రోజులుగా కనిపించకుండా తిరుగుతున్న చిరుతపులి నిన్న రాత్రి విశ్వవిద్యాలయ సమీపంలోని నారం ఫామ్ హౌస్ లోని ఓ ఇంటిలోకి వెళ్లిన చిరుత కిటికీలోంచి తొంగిచూసింది. చిరుత సంచరించిన వీడియో సిసిటివీ కెమెరాల్లో రికార్డయ్యింది. చిరుత సంచారంలో ఉద్యోగులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

గత నెల 14వ రంగారెడ్డి జిల్లా కాటేదాన్ రైల్వే అండర్ పాస్ దగ్గర ఉదయం 6గంటలకు సమయంలో చిరుత రోడ్డుపై కనిపించింది. జాతీయ రహదారిపై చిరుత దాదాపు 2గంటల పాటు హంగామా సృష్టించింది. అనంతరం  పక్కనున్న వ్యవసాయ పోలంలోకి పారిపోయింది. వ్యవసాయ యూనివర్సిటీ, పోలీస్‌ అకాడమీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. చిరుతును త్వరగా బంధించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News