Friday, May 17, 2024

ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమ గీతం పాడుదాం : బిసి సేన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని బిసి సేన నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం బిసి భవనల్‌లో బిసి సేన జాతీయ అధ్యక్షులు బర్కా కృష్ణ ఆధ్వర్యంలో బిసి సేన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బిసి కార్పొరేషన్, బిసి ఫెడరేషన్ లకు రాయితీ రుణాలకోసం ఎనిమిది సంవత్సరాల క్రితం ఐదు లక్షలు 77 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వారికి తక్షణమే రాయితీ రుణాలిచ్చి ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. బిసి మంత్రులు, శాసనసభ్యులు మౌనం వీడి బిసి బందు పథకం అమలు చేసేలా ముఖ్యమంత్రి పై ఒత్తిడి తేవాలని సూచించారు. రాజకీయ పార్టీలకుఎన్నికలప్పుడే బిసిలు గుర్తుకు వస్తారని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో జనాభా దమాషా ప్రకారం రాజకీయ పార్టీలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బిసి కుటుంబానికి 10 లక్షలకు తగ్గకుండా 100శాతం రాయితి రుణాలిచ్చి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో బిసి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణయాదవ్, నాయకులు వెంకటేష్ యాదవ్, హేమంత్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News