Friday, May 3, 2024

అమరుల సేవలను ఎప్పటికీ స్మరించుకుందాం

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
  • మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్య మహిళా
  • జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ

సిద్దిపేట రూరల్: అమరుల సేవలను ఎప్పటికీ స్మరించుకుందామని జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. గురువారం రెడ్డి ఫంక్షన్ హాల్‌లో చైర్‌పర్సన్ రోజాశర్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ అమరులకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యమంలో అసువులు బాసిన అమరుల ఆశయ స్ఫూర్తితో సిఎం కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన అమరుల సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సర కాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు , వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ఈ నెల 2 నుంచి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావు అదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాల ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా అభివృద్ధి చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పంజాబ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిచిందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళ రిజర్వేషన్ 33 శాతం నుంచి 50 శాతానికి పెంచారన్నారు. పుట్టినప్పటి నుంచి పండు ముసలి వరకు న్యూట్రిషన్ కిట్, కెసిఆర్ కిట్, అంగన్‌వాడీ, విద్య, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్ల ద్వారా వివిధ దశల్లో ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ఆరోగ్య మహిళా కార్యక్రమం చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1002 రెసిడెన్షియల్ విద్యా సంస్థల ద్వారా విద్యాబోధన చేస్తుందన్నారు. పేదరిక నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాల వలన కూలీ నుంచి ఐఎఎస్ వరకు అందరూ సంతోషంగా జీవిస్తున్నారన్నారు. అనంతరం అదనపు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News