Sunday, April 28, 2024

హెచ్1బి వీసాలపై నిషేధం ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

Lifting the temporary ban on H1B visas

 

అమెరికా అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం
ఎన్నికల ముంగిట ట్రంప్‌కు భారీ షాక్
లక్షలాది భారతీయ ఐటి నిపుణులకు ఊరట

అమెరికా: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ భారీ షాక్ తగిలింది. హెచ్1బి వీసాలతో సహా వర్కింగ్ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తిరస్కరించింది. తాత్కాలిక వీసాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన హెచ్1బీ వీసా నిషేధంపై నిలువరిస్తూ కాలిఫోర్నియా జిల్లా జడ్జి జెఫ్రీ వైట్ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అంతేకాదు ట్రంప్ తన రాజ్యాంగ అధికారాన్ని మించిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో హెచ్1బి వీసా ఆంక్షలను తక్షణమే అడ్డుకుంటుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ ప్రతినిధులు తెలిపారు. తాజా తీర్పుతో లక్షలాది మంది భారతీయ ఐటి నిపుణులకు ఊరట లభించినట్లయింది.

నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్, యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రిటైల్ ఫెడరేషన్ , టెక్ నెట్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్తి ఈ ఆదేశాలిచ్చారు. ఆర్థిక పునరుద్ధరణ, వృద్ధి ఆవిష్కరణలు అవసరమైన సమయంలో తమకు అడ్డంకులు కల్పించారని వాదించాయి. కీలకమైన కష్టసాధ్యమైన ఉద్యోగాలను నిరోధిస్తున్నవీసా పరిమితులపై ఈ తీర్పు ఊరటనిస్తుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు పలు వీసాలను నిలిపివేస్తున్నామని, అమెరికన్లకే ఉద్యోగాలు అన్నదే తమ నినాదమంటూ ట్రంప్ గత జూన్ 22 న ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్1బీ, హెచ్ 4, హెచ్ 2బి, జె, ఎల్ వీసా సహా ఇతర విదేశీ వీసాలను జారీపై తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News