Monday, April 29, 2024

రైతులు విజయం సాధిస్తారు

- Advertisement -
- Advertisement -

Sonia gandhi said Farmers succeed on Agri bills

 

గాంధీ చూపిన బాటలో రైతులు ఆందోళన చేస్తున్నారు
అగ్రి ఆందోళనలపై వీడియో సందేశంలో సోనియా గాంధీ

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీకి రైతులు, కూలీలు, కార్మికులు అంటే ఎంతో సానుభూతి అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంటూ, ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన మూడు నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన విజయవంతమవుతుందని, రైతులు విజం సాధిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం సందర్భంగా సోనియాగాంధీ ఇరువురు నేతలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ప్రకటనలో భారత దేశపు ఆత్మ పల్లెల్లో ఉందని గాంధీజీ ఎప్పుడూ చెప్పే వారని, అందుకే లాల్ బహదూర్ శాస్త్రి ‘ జై జవాన్, జై కిసాన్ నినాదం ఇచ్చారని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా సోనియా ఈ వీడియో సందేశం ఇచ్చారు.

భారత దేశపు ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీజీ ఎప్పుడూ చెప్పేవారని ఆమె గుర్తు చేస్తూ రైతు వ్యతిరేక నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు వీథుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. వీటిని చట్టబద్ధం చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ తమ చెమటతో ధాన్యాన్ని పండిస్తున్న రైతులు రక్తాశ్రువులు కార్చేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల ఆమోదం తీసుకునే చట్టాలు చేసేదని, చట్టాలు చేసేటప్పుడు ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా భావించేదని పోనియా అన్నారు. ప్రజాస్వామ్యమంటే ప్రభుత్వం తీసుకునే ప్రతినిర్ణయం ప్రజల ఆమోదంతో తీసుకోవడమేనని కూడా ఆమె అన్నారు.

మోడీ ప్రభుత్వానికి దీనిలో నమ్మకముందా? అని ఆమె ప్రశ్నిస్తూ రైతులకున్న తగినంత పరిహారం పొందే హక్కును ఆర్డినెన్స్ ద్వారా మార్చలేకపోయిన విషయం దానికి గుర్తుందా అని అన్నారు.‘ఈ మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తన ఆందోళనను కొనసాగిస్తుంది. ఈ రోజు పార్టీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలోను రైతులు, కార్మికులకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకోసం చేస్తున్న ఈ ఆందోళన విజయవంతమవుతుందని, రైతులు విజయం సాధిస్తారని నేను గట్టి నమ్మకంతో చెప్పగలను’ అని సోనియాగాంధీ తన వీడియో సందేశంలో అన్నారు. కాగా ఈ నెల 3నుంచి 5 వరకు పంజాబ్‌లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News