Wednesday, May 15, 2024

ఎవరు పట్టించుకోవడంలేదు: సఫీల్ గూడలో వలస కూలీల ధర్నా..

- Advertisement -
- Advertisement -

 

లాక్ డౌన్ కారణంగా మల్కాజిగిరి సఫీల్ గూడలోని జైన్ కన్ స్ట్రక్షన్ వద్ద పనిచేస్తున్న బీహార్, యుపి, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ కు చెందిన సుమారు 500 మంది వలసకూలీలు రాష్ట్రంలో చిక్కుకుపోయారు. అయితే, గత 15 రోజులుగా తమను ఎవరు పట్టించుకోవడంలేదని, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని.. మా కాంట్రాక్టర్లు గాని ప్రభుత్వం గానీ తమకు ఎటువంటి సహాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సఫీల్ గూడా రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని లేకపోతే తమ రాష్ట్రాలకు తమను తరలించాలని వేడుకుంటున్నారు. తమకు ఎక్కడా సోసిల్ డిస్టెన్స్ లేదని ఒక్కొక్క గదిలో 10 మందిని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వలస కూలీల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వ 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున ప్రతీ వలస కార్మికుడికి అందజేస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. సిఎం ఆదేశాలతో చాలా చోట్ల వలస కూలీలకు బియ్యం, రూ.500 అందజేశారు.

Lockdown Updates: Migrant Workers protest at Safilguda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News