Saturday, September 30, 2023

కరీంనగర్ లో టాటా ఎస్ ని ఢీకొట్టిన లారీ

- Advertisement -
- Advertisement -

Lorry collided TATA AC

కరీంనగర్: టాటా ఎస్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చెంజర్ల వద్ద లారీ అదుపు తప్పి టాటాఎస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో టాటా ఎస్ లో ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వేముల వాడ, కొండగట్టు దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుల భూపాలపల్లికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News