Tuesday, April 30, 2024

‘లవ్ స్టోరి’ని రెండు మూడు సార్లు చూస్తాను

- Advertisement -
- Advertisement -

Love story pre release event

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి‘. ఈ సినిమా ఈనెల 24న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘లవ్ స్టోరి‘ అన్ ప్లగ్‌డ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని గ్రాండ్‌గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడు తూ… నాగ చైతన్య, సాయి పల్లవి జంట లవ్ స్టోరి చిత్రంలో బాగుంది. వాళ్లద్దరూ బాగా నటించారని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది అని అన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడు తూ… శేఖర్ కమ్ముల సినిమాను నేనెంతో అభిమానిస్తాను. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. పవన్ మ్యూజిక్ అదిరిపోయింది.

సారంగ దరియా సాంగ్ కోసమైనా ‘లవ్ స్టోరి‘ సినిమా రెండు మూడు సార్లు చూస్తాను. కరోనా సమయంలో ఇండస్ట్రీలో కార్మికులు పనిలేక అల్లాడిపోయారు. వాళ్లకు మేమంతా కలిసి నిత్యావసర వస్తువులు అందించి, ఆదుకున్నాము. ఇదే కాదు ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది సినిమా తారలు అని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని వినమ్రంగా కోరుతున్నా అని అన్నారు.

తర్వాత అమీర్ ఖాన్ మాట్లాడుతూ… నాగ చైతన్యను లాల్ సింగ్ చద్దా కోసం ఫస్ట్ టైమ్ కలిశాను. ఆయనతో పనిచేస్తుంటే, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. లవ్ స్టోరి సినిమా కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేనూ మీలాగే లవ్ స్టోరి చిత్రాన్ని ఈనెల 24న చూస్తాను అని తెలిపారు. దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే విడుదల చేయాలని నిర్ణయించిన నిర్మాత నారాయణదాస్ నారంగ్‌కి కృతజ్ఞతలు. లవ్ స్టోరి చిత్రాన్ని థియేటర్‌లో చూడండి. ఈ చిత్రం అందరికి తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ ‘లవ్‌స్టోరి’ చిత్రంలో నటించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్‌రావు, హీరో, హీరోయిన్లు నాగచైతన్య, సాయి పల్లవి, ఇతర చిత్రం బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News