Saturday, April 27, 2024

అర్ధరాత్రి యువతిపై దాడి… బయటకు లాక్కొచ్చి..

- Advertisement -
- Advertisement -

Lover attack on women in Hyderabad

హైదరాబాద్: ప్రేమించిన యువకుడు ఓ యువతిని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆమెను కిడ్నాప్‌కు గురి చేసిన సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ యువతి, చావ వినయ్ చౌదరి అనే వ్యక్తి స్నేహితులుగా ఉన్నారు. వారి స్నేహం ప్రేమగా మారడంతో సహజీవనం చేశారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఏప్రిల్ 16 అర్ధరాత్రి ఆమె ఉంటున్న ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేశాడు. ఆమె ఇతరుకు ఫోన్ చేయకుండా స్మార్ట్ ఫోన్‌ను పగలగొట్టాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా బలవంతంగా ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి కారులోకి తోసి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. ఆమె అరవడంతో స్థానికులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిపై ఐపిసి 448, 354, 427, 506 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News