Saturday, April 27, 2024

తగిన చర్యలు తీసుకోకుంటే భారీగా మూడో ముప్పు రావచ్చు

- Advertisement -
- Advertisement -
MA warns of massive third wave of Covid amid Omicron
అదనపు డోసులపై కేంద్రం ప్రకటనకు ఐఎంఎ వినతి

న్యూఢిల్లీ : ఒమిక్రాన్ కలవరంలో కరోనా టీకా అదనపు డోసులపై ప్రకటన చేయాలని ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ప్రభుత్వాన్ని కోరింది. వైద్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, బలహీన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు అదనపు డోసు ఇవ్వాలని సూచించింది. అలాగే 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి టీకాలు వేసే ప్రతిపాదనను వేగంగా పరిశీలించాలని డిమాండ్ చేసింది. ఒమిక్రాన్‌కు వేగంగా ప్రబలే లక్షణం ఉందని, ఎక్కువ మందిని ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలుస్తోందని, దీనిపై తగిన చర్యలు తీసుకోకుంటే భారీ స్థాయిలో మూడో వేవ్ రావచ్చునని ఓ మీడియా సమావేశంలో ఐఎంఎ హెచ్చరికలు చేసింది.

ఈ సమయంలో వ్యాక్సినేషన్‌పై శ్రద్ధ వహిస్తే భారత్ ఒమిక్రాన్ ప్రభావాన్ని తప్పకుండా అధిగమించగలదని పేర్కొంది. అర్హులంతా టీకా తీసుకోవడం పైనే దృష్టి పెట్టాలని, ఇప్పటివరకు టీకాలు తీసుకోలేని వారికి అందేలా చూడాలని , రెండో డోసు తీసుకోవాల్సిన వారిపై శ్రద్ధ పెట్టాలని సూచించింది. ప్రారంభ నివేదికలను బట్టి ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో తీవ్రత తక్కువే ఉందని, డెల్టాతో పోలిస్తే మాత్రం ఐదు నుంచి పది రెట్లు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోందని వివరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ద్వారా అంటువ్యాధిని నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రయాణాలపై ఆంక్షలను తాము సమర్థించనప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేయాలని పేర్కొంది. ఆఫ్రికన్ దేశాల్లో ఈ వేరియంట్ బయటపడిన తరువాత ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. పాఠశాలలు, కళాశాలలల్లో కొవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటించాలని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News