Friday, May 10, 2024

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన స్వీడన్ తొలి మహిళా ప్రధాని

- Advertisement -
- Advertisement -

Magdalena andersson presents her government

కేర్ టేకర్ హోదాలో స్వీడిష్ ప్రభుత్వానికి నాయకత్వం

కోపెన్‌హాగన్: స్వీడన్ తొలి మహిళా ప్రధాని మాగ్డలీనా ఆండర్సన్ మంగళవారం తన ఏకపక్షం మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇదివరకటి క్యాబినెట్‌తో పోల్చినప్పుడు ఆమె తన మంత్రివర్గంలో చాలా తక్కువ మార్పులే చేశారు. మాగ్డలీని ఆండర్సన్ ఇదివరలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆమె మైకేల్ డామ్‌బర్గ్‌ను తాను నిర్వహించిన ఆర్థిక మంత్రి పదవిలో భర్తీచేశారు.

ఆయన ఇదివరకు అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. స్కాండినేవియన్ దేశం అధినేతగా మాగ్డలీనా ఆండర్సన్ సోమవారం ఎన్నికయ్యారు. ఇదివరకు గ్రీన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి పనిచేసిన ఇదివరకటి ప్రధాని బడ్జెట్ విషయంలో విఫలం కావడంతో తన పదవిని వొదులుకున్నారు. అది జరిగిన ఏడుగంటలకు మాగ్డలీనా ఆండర్సన్ గత వారం తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. నయానాజీ ఉద్యమంలో పాతుకుపోయిన రైట్‌వింగ్ పాపులిస్ట్ స్వీడన్ డెమోక్రాట్లతో సహా ప్రతిపక్ష పార్టీలు సమర్పించిన ఒకదానికి అనుకూలంగా ఆమె ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఈ చర్య చోటుచేసుకుంది.

మాగ్డలీనా ఆండర్సన్‌ను సోమవారం ప్రధాన మంత్రిగా నియమించారు. ఆమెకు అనుకూలంగా 101 మంది శాసనకర్తలు ఓటువేయగా, 173 మంది వ్యతిరేకించారు. కాగా 75 మంది శాసనకర్తలు గైర్హాజరయ్యారు. స్వీడిష్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటులో మెజారిటీ ఉన్నంత వరకుకనీసం 175 మంది శాసనకర్తలు ఉన్నంత వరకు ప్రధాన మంత్రులను పేర్కొనవచ్చు, పాలించనూ వచ్చు. వారిని వ్యతిరేకించలేరు. ఇదిలావుండగా మాగ్డలీనా ఆండర్సన్ విదేశాంగ మంత్రిగా ఆన్ లిండేను, రక్షణ మంత్రిగా పీటర్ హల్ట్‌క్విస్ట్‌ను యథాతధంగా ఉంచేశారు.

గత ప్రభుత్వంలో పర్యావరణం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలను గ్రీన్స్ నిర్వహించారు. కాగా ఆ రెండు పదవులను ఇప్పుడు సోషల్ డెమాక్రాట్లకు చెందిన అన్నికా స్ట్రంధాల్, జీనెట్ గుస్టాఫ్‌స్‌డోటర్ చేపట్టారు. ఇదివరకటి ప్రధాని స్టెఫాన్ లోఫ్వెన్ స్థానంలో మాగ్డలీనా ఆండర్సన్ పార్టీ నాయకురాలిగా, ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సంవత్సరం ఆరంభంలోనే ఆయన తన పాత్రలను వదులుకున్నారు. స్వీడన్ నామమాత్రపు చక్రవర్తి కార్ల్ 16 గుస్తావ్, ప్రేక్షకుల సమక్షంలో మాగ్డలీనా ఆండర్సన్ మంగళవారం అధికారికంగా నియుక్తులవుతారు. ఆమె ఆపత్కాల హోదాలో స్వీడిష్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. కాగా లోఫ్వెన్ పదవీ విరమణ చేయనున్నారు. ఇదిలావుండగా స్వీడన్ తదుపరి సార్వత్రిక ఎన్నికలు సెప్టెంబర్ 11న జరుగనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News