Sunday, April 28, 2024

ఘనంగా మహా పోచమ్మ బోనాలు

- Advertisement -
- Advertisement -

ధర్మారం: ధర్మారంలో మహా పోచమ్మ బోనాలు గురువారం వైభవంగా నిర్వహించారు. దశాబ్దన్నర తర్వాత ధర్మారం మండల కేంద్రంలో ధర్మారం సర్పంచ్ పూసుకూరు జితేందర్ రావు, పాలకవర్గం ఆధ్వర్యంలో నాలుగు రోజుల పండుగలో భాగంగా నిర్వహిస్తున్న ఏలసంపుడు కార్యక్రమంలో తొలి ఘట్టం పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్ని కులాలు, వర్గాల ప్రజలు ఐక్యతగా ముందుకు వచ్చి ఈ పండుగ నిర్వహిస్తుండగా ఇంటికో బోనంతో బైండ్ల పూజారుల డప్పు చప్పుళ్ల మధ్య మహిళలు పెద్ద ఎత్తున పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు.

ఉదయం నుండి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ధర్మారం పట్టణ మహిళలు మహా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా బైండ్ల పూజారులు జంతువలను గావుపట్టి పోచమ్మ తల్లికి రక్తార్పణ చేసి గ్రామ పొలిమేర చుట్టు తిరిగి గ్రామానికి శుభం కలగాలని పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు పాల్గొన్నారు.

ధర్మారం జడ్పీటీసీ దంపతులు పూసుకూరు జితేందర్ రావు పద్మజల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులు పోచమ్మ తల్లికి బోనం సమర్పించారు. పట్టణ ప్రజలందరు సుఖ శాంతులతో వర్ధిల్లాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. అనంతరం సర్పంచ్, జడ్పీటీసీ దంపతులు మంత్రి ఈశ్వర్ స్నేహలత దంపతులను ఘనంగా సన్మానించారు.

పోచమ్మ బోనాలు 15 ఏళ్ల తర్వాత అంగరంగ వైభవంగా నిర్వహించగా, అన్ని వర్గాల ప్రజలు, మహిళలు తరలి రావడంతో ధర్మారం పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు పూసుకూరు రామారావు, ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉపసర్పంచ్ ఆవుల లత, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బాస తిరుపతిరావు, బీఆర్‌ఎస్ నాయకులు దేవి జనార్ధన్, సుతారి రామన్న పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News