Saturday, April 27, 2024

పాకిస్తాన్‌లో మహారాజ రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం

- Advertisement -
- Advertisement -

Maharaja Ranjit Singh Statue vandalised in Pakistan

లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన లాహోర్ కోట వద్ద ఉన్న తొలి సిక్కు పాలకుడు మహారాజ రంజిత్ సింగ్ కాంస్య విగ్రహాన్ని నిషిద్ధ తెహ్రీక్-ఇ-లబ్కాయిక్ పాకిస్తాన్(టిఎల్‌పి) కార్యకర్త మంగళవారం ధ్వంసం చేసినట్లు పత్రికా కథనాలు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. 9 అడుగుల మహారాజ రంజిత్ సింగ్ విగ్రహం వద్ద టిఎల్‌పి కార్యకర్త ఒకడు నినాదాలు చేస్తూ విగ్రహం చేతిని విరగ్గొట్టడంతోపాటు గుర్రం మీద కూర్చుని ఉన్న విగ్రహం ఛాతీని ధ్వంసం చేసి కింద పడేయగా ఒక వ్యక్తి వారిస్తున్న దృశ్యం వీడియోలో కనిపించింది. కాగా, నిందితుడిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక తెలిపింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని లాహోర్ కోట పాలనా యంత్రాంగం తెలిపింది. ఈ సంఘటనపై పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫావద్ చౌదరి స్పందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ప్రతిష్టకు ఇలాంటి నిరక్షరాస్యుల వల్లే ఎక్కువ ముప్పని వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News