Friday, April 26, 2024

త్రివిక్రమ్‌తో మూవీకి ముహూర్తం ఖరారు

- Advertisement -
- Advertisement -

Mahesh Babu Movie with Trivikram

 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ అనే మాస్ మసాలా డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వరుస సూపర్ హిట్ చిత్రాల అనంతరం మహేష్ ఈ సినిమా చేస్తుండడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రం లైన్‌లో ఉండగానే ఈ సూపర్ స్టార్ మరిన్ని సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. మరి వాటిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా కూడా ఉంది. అయితే ఈ బిగ్ మూవీని ప్రకటించి చాలా కాలమే అయింది. మరి ఇప్పుడు ఈ సినిమాకి ముహూర్తం ఖరారు అయినట్టు తెలిసింది. ఆగస్టు 9న మహేష్ బర్త్ డే నాడు ఈ సినిమా అధికారికంగా ముహూర్తం జరుపుకోనున్నట్టు టాక్. అలాగే ఈ సినిమాను కూడా ‘సర్కారు వారి పాట’తోనే కలిసి ఏకకాలంలో షూటింగ్ జరపాలని నిర్ణయించారట.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News